భార్య మృతి: కూతురిపై నెలలుగా పదే పదే అత్యాచారం

Published : Apr 30, 2019, 10:29 AM IST
భార్య మృతి: కూతురిపై నెలలుగా పదే పదే అత్యాచారం

సారాంశం

బాలిక నికృష్టమైన పరిస్థితిని గమనించిన చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నాలుగో తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా బాలిక అసాధారణంగా ప్రవర్తిస్తుండడంతో చుట్టుపక్కలవాళ్లు ప్రశ్నిస్తూ వచ్చారు. 

గుర్గావ్: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొన్ని నెలలుగా తన 8 ఏళ్ల కూతురిపై ఓ తండ్రి అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఈ సంఘటన హర్యానాలోని గుర్గావ్ లో చోటు చేసుకుంది. భార్య మరణించిన తర్వాత అతను కూతురిపై అత్యాచారం సాగిస్తూ వస్తున్నాడు

బాలిక నికృష్టమైన పరిస్థితిని గమనించిన చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నాలుగో తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా బాలిక అసాధారణంగా ప్రవర్తిస్తుండడంతో చుట్టుపక్కలవాళ్లు ప్రశ్నిస్తూ వచ్చారు. దాంతో తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి బాధితురాలు వారికి చెప్పింది. 

గత రెండు నెలలుగా తనపై తన తండ్రి అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు చుట్టుపక్కలవారికి చెప్పింది.  మద్యం తాగి వచ్చి ప్రతి రాత్రి తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు బాధితురాలు చెప్పింది. గత వారు బాలికపై అతను రెండు సార్లు లైంగిక దాడి చేశాడు. బాలికను కౌన్సెలింగ్ కోసం చిల్డ్రన్స్ అబ్జర్వేషన్ సెంటర్ కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్