గుణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

By Siva Kodati  |  First Published Mar 15, 2024, 9:28 PM IST

విజయరాజే సింధియా ఆరు సార్లు , మాధవ్ రావ్ సింధియా నాలుగు సార్లు, జ్యోతిరాదిత్య సింధియా నాలుగు సార్లు గుణ నుంచి ప్రాతినిథ్యం వహించారు. వీజీ దేశ్‌పాండే, జేబీ కృపాలాణి వంటి దిగ్గజాలను ఈ గడ్డ పార్లమెంట్‌కు పంపింది. మధ్యప్రదేశ్‌లోని 29 పార్లమెంట్ స్థానాల్లో గుణ ఒకటి. శివపురి, పిచోర్, కొలారస్, బామోరి, గుణ, అశోక్ నగర్, చందేరి, ముంగవోలి అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో గుణ నియోజకవర్గంలో 16,75,724 మంది ఓటర్లు వున్నారు. వీరిలో పురుషులు 8,89,161 మంది.. మహిళా ఓటర్లు 7,86,519 మంది. బీజేపీ 1,25,549 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి.. గుణలో సింధియా ఫ్యామిలీ జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. 


రాచరికానికి, రాజకుటుంబాలకు కేంద్రం గుణ లోక్‌సభ నియోజకవర్గం . మధ్యప్రదేశ్‌లోని 29 పార్లమెంట్ స్థానాల్లో గుణ ఒకటి. శివపురి, పిచోర్, కొలారస్, బామోరి, గుణ, అశోక్ నగర్, చందేరి, ముంగవోలి అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. గ్వాలియర్ సంస్థానానికి చెందిన సింధియా రాజకుటుంబానికి ఈ నియోజకవర్గం కంచుకోట. రాజమాత విజయరాజే సింధియా, మాధవరావ్ సింధియా,  జ్యోతిరాదిత్య సింధియాలు ఇక్కడి నుంచి రాజకీయాలు చేశారు. విజయరాజే సింధియా ఆరు సార్లు , మాధవ్ రావ్ సింధియా నాలుగు సార్లు, జ్యోతిరాదిత్య సింధియా నాలుగు సార్లు గుణ నుంచి ప్రాతినిథ్యం వహించారు. వీజీ దేశ్‌పాండే, జేబీ కృపాలాణి వంటి దిగ్గజాలను ఈ గడ్డ పార్లమెంట్‌కు పంపింది. 

గుణ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. రాజుల కంచుకోట :

Latest Videos

ఎన్నికల కమీషన్ డేటా ప్రకారం.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో గుణ నియోజకవర్గంలో 16,75,724 మంది ఓటర్లు వున్నారు. వీరిలో పురుషులు 8,89,161 మంది.. మహిళా ఓటర్లు 7,86,519 మంది. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ 9 సార్లు, బీజేపీ 6 సార్లు, ఇతరులు నాలుగు సార్లు విజయం సాధించారు. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 8 శాసనసభ సెగ్మెంట్లలో కాంగ్రెస్ 2 చోట్ల, బీజేపీ 6 చోట్ల విజయం సాధించాయి. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి కృష్ణపాల్ సింగ్ యాదవ్‌కి 6,14,049 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి జ్యోతిరాదిత్య సింధియాకు 4,88,500 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 1,25,549 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి.. గుణలో సింధియా ఫ్యామిలీ జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. తన ఓటమికి దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్‌లే కారణమని భావించిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ తీర్ధం పుచ్చుకోవడంతో పాటు తన వర్గం మొత్తాన్ని పట్టుకెళ్లారు. దీంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

గుణ ఎంపీ ( పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. బీజేపీ పట్టు నిలుపుకుంటుందా :

గుణలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇక్కడి నుంచి ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు టికెట్ ఖరారు చేసింది. సింధియా బ్రాండ్ నేమ్, ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని జ్యోతిరాదిత్య భావిస్తున్నారు. అటు తన కంచుకోటలో తిరిగి పాగా వేయాలని కాంగ్రెస్ సైతం పట్టుదలగా వుంది. జ్యోతిరాదిత్యను ఓడించే బలమైన అభ్యర్ధి కోసం వేటాడుతోంది. 
 

click me!