‘దెయ్యాల గుంపు వేధిస్తుంది, చంపుతానంటున్నాయి..నన్ను కాపాడండి..’.. పోలీస్ స్టేషన్ కు వింత కేసు..

Published : Jun 30, 2021, 01:44 PM IST
‘దెయ్యాల గుంపు వేధిస్తుంది, చంపుతానంటున్నాయి..నన్ను కాపాడండి..’.. పోలీస్ స్టేషన్ కు వింత కేసు..

సారాంశం

గుజరాత్ పంచమహల్ జిల్లా జంబుఘోడ తాలూకా హామ్లెట్ గ్రామానికి చెందిన వర్సంగ్ భాయ్ బరియా (35) అనే వ్యక్తి మంగళవారం పోలీస్ స్టేషన్ కు వెల్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఓ దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని తెలిపాడు. మరీ ముఖ్యంగా ఆ గుంపులోని రెండు దెయ్యాలు తనను చంపుతామని బెదిరిస్తున్నాయని వాపోయాడు. 

దెయ్యాలున్నాయో, లేదో తెలియదు కానీ, వాటికి సంబంధించిన వార్తల మీద జనాలకు ఎంతో ఆసక్తి. దెయ్యాలను వదిలించే బాబాలకు మన సమాజంలో ఫుల్ డిమాండ్. ఇప్పుడు ఈ దెయ్యాల గొడవెందుకంటే.. తాజాగా గుజరాత్ లో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. దెయ్యాల గుంపు తనను వేదిస్తుందని వాటి నుంచి తన ప్రాణాలు కాపాడాల్సిందిగా ఓ వ్యక్తి ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. వింత ఫిర్యాదు చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

వివరాల్లోకి వెడితే...గుజరాత్ పంచమహల్ జిల్లా జంబుఘోడ తాలూకా హామ్లెట్ గ్రామానికి చెందిన వర్సంగ్ భాయ్ బరియా (35) అనే వ్యక్తి మంగళవారం పోలీస్ స్టేషన్ కు వెల్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఓ దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని తెలిపాడు. మరీ ముఖ్యంగా ఆ గుంపులోని రెండు దెయ్యాలు తనను చంపుతామని బెదిరిస్తున్నాయని వాపోయాడు. ఎలాగైనా తన ప్రాణం కాపాడాల్సిందిగా పోలీసులను అభ్యర్థించాడు. 

బరియా మాటలు, వాలకం చూసిన పోలీసులకు కాస్త తేడా కొట్టింది.. దాంతో అతడిని పక్కకు కూర్చోబెట్టి, కుటుంబ సభ్యలను పిలిచి విచారించారు. ఈ క్రమంలో రియా మానసిక పరిస్థితి సరిగా లేదని, గతేడాది నుంచి చికిత్స తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

గత పది రోజులుగా మందులు తీసుకోవడం మానేశాడని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు వెల్లడించారు. ఇక బరియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడికి వైద్యం అందించాల్సిందిగా సూచించారు. 
 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu