Gujarat elections: సూరత్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రోడ్‌షోపై రాళ్ల దాడి

Published : Nov 29, 2022, 01:03 AM IST
Gujarat elections: సూరత్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రోడ్‌షోపై రాళ్ల దాడి

సారాంశం

Surat: గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ రోడ్ షో నిర్వ‌హిస్తుండ‌గా.. ప‌లువురు రాళ్ల‌దాడి చేశారు. గ‌త‌వారం కూడా త‌మ బహిరంగ స‌భ‌పై ప‌లువురు రాళ్లు రువ్వార‌ని ఆప్ ఇదివ‌ర‌కు ఆరోపించింది.   

Gujarat assembly elections: గుజరాత్ లోని సూరత్ లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్య‌మంత్రిపై కొంద‌రు రాళ్లు రువ్వారు. ఆప్ రోడ్ షో నగర సందు గుండా వెళ్తుండగా రాళ్లు విసిరారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన కేజ్రీవాల్.. "నేను ఇప్పుడే వస్తున్నాను కాబట్టి నాపై రాళ్లు రువ్వారు. నా తప్పేంటి.. 27 ఏళ్లుగా ఏదో ఒక పని చేసి ఉంటే నాపై రాళ్లు రువ్వాల్సిన అవసరం ఉండేది కాదు. నేను స్కూల్, హాస్పిటళ్ల‌ గురించి మాట్లాడినందుకు కేజ్రీవాల్ కాళ్లు విరగ్గొడతాం అని వాళ్ల నాయకుడు" అంటున్నారని అన్నారు. 

 

ఇదిలావుండ‌గా, ఎలాంటి రాళ్లదాడి ఘటన జరగలేదని పోలీసులు పేర్కొంటూ.. "ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ర్యాలీ సందర్భంగా రాళ్లదాడి జరగలేదు.. మేము అక్కడికక్కడే ఉన్నాము. ర్యాలీ శాంతియుతంగా జరిగింది. కేజ్రీవాల్ ర్యాలీలో నిందితులు  మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. అందుకే వారిని అదుపులోకి తీసుకున్నాం" అని పేర్కొన్నారు.

 

 

ఇటీవలి ఘటనకు కొద్ది రోజుల ముందు రాష్ట్రంలో జరిగిన బహిరంగ సభలో రాళ్లు రువ్వారని గత వారం ప్రారంభంలో ఆప్ ఆరోపించింది. గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ ఇటాలియా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసి, రాళ్లు రువ్వడం వల్ల ఒక చిన్నారి గాయపడ్డాడని పేర్కొన్నారు. కతర్గాం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ గూండాలు ఈ రోజు తన బహిరంగ సభలో రాళ్లు రువ్వారని, దీంతో ఒక చిన్నారిని గాయపరిచారని ఆయన ట్వీట్ చేశారు.

 

 

 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే