ఢిల్లీ పోలింగ్: పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన వరుడు, ఫ్యామిలీ

Published : Feb 08, 2020, 11:49 AM IST
ఢిల్లీ పోలింగ్: పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన వరుడు, ఫ్యామిలీ

సారాంశం

ఓ వరుడు, అతని కుటుంబ సభ్యులు రంగు రంగుల సంప్రదాయ వివాహ వేడుక దుస్తుల్లో వచ్చి క్యూలో నిలుచుని ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటేశారు. వారు ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.

న్యూఢిల్లీ: వరుడు తన వెడ్డింగ్ డ్రెస్ లో వచ్చి తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ ఎన్నికల్లో ఓటేశాడు. రంగు రంగుల సంప్రదాయ దుస్తుల్లో వరుడితో పాటు అతని కుటుంబ సభ్యులు క్యూలో నించుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

తూర్పు ఢిల్లీలోని షకార్పూర్ లో వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటరు కార్డులు చేతుల్లో పట్టుకుని తల పాగాలు చుట్టుకుని వారు ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటేయడానికి పెద్ద యెత్తున ప్రజలు వస్తున్నారు. 

111 ఏళ్ల వయస్సు గల మహిళ కలతార మండల్ తన ఓటు హక్కును వాడుకున్నారు. ఆమె అవిభాజిత భారతదేశంలో 1908లో జన్మించారు. ఢిల్లీలోని 70 శాసనసభ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఆప్, బిజెపి, కాంగ్రెసు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu
Fresh Snowfall in Sonamarg: మోదీ ప్రారంభించిన సోనమార్గ్ఇప్పుడు ఎలా ఉందో చూడండి| Asianet News Telugu