కరోనా కేసుల రికార్డ్.. ఒక్క రోజులో 3.16లక్షల మందికి పాజిటివ్

By telugu news teamFirst Published Apr 22, 2021, 8:20 AM IST
Highlights


కాగా.. గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి కారణంగా దేశంలో 2,102 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా రిపోర్టు ప్రకారం.. బుధవారం 3,15,925 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 

దేశంలో కరోనా సెకండ్ సేవ్ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఊహించని రీతిలో మహమ్మారి ప్రజలను భయపెడుతోంది. తాజాగా... కేవలం 24గంటల్లో 3.16లక్షల మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసులన్నింటిలో ఇదే ఎక్కువ కావడం గమనార్హం. ఒక్క సింగిల్ డేలో ఇన్ని కేసులు నమోదవ్వడం ప్రభుత్వాలను మరింత కలవరపెడుతోంది.

కాగా.. గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి కారణంగా దేశంలో 2,102 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా రిపోర్టు ప్రకారం.. బుధవారం 3,15,925 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మూడు లక్షల మార్క్ చేరకోవడం తో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలా మూడు లక్షల కేసులు అమెరికాలో జనవరిలో నమోదు కాగా.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఆ పరిస్థితి భారత్ లో చోటుచేసుకోవడం గమనార్హం.

భారత్ లో సరిగ్గా 17 రోజుల క్రితం లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ 17 రోజుల వ్యవధిలో ఈ కరోనా కేసుల సంఖ్య రోజుకి 3లక్షలకు చేరుకుంది. అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్న దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా కరోనా కేసులు నమోదౌతుండటం గమనార్హం.

దేశంలో ఈ కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదౌతున్నాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ముందు వరసలో మహారాష్ట్ర ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఉన్నాయి. కాగా.. చివరి స్థానాల్లో  ఉత్తరాఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

click me!