ఓ మహిళను హతమార్చి తానే మరణించినట్టు నమ్మించింది.. సీరియల్ ప్రేరణతో నేరం.. అప్పులవాళ్ల నుంచి తప్పించుకోవడానికే!

By Mahesh KFirst Published Dec 2, 2022, 8:51 PM IST
Highlights

గ్రేటర్ నోయిడాలో ఓ మహిళ అప్పులవాళ్ల నుంచి తప్పించుకోవడానికి తనలాంటి ఓ మహిళను హత్య చేసి తానే మరణించినట్టు నమ్మించింది. వారి బంధువుల ఆ డెడ్ బాడీ తమ బంధువే అని అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కానీ, హత్యకు గురైన మహిళ బంధువులు దాఖలు చేసిన మిస్సింగ్ కంప్లైంట్‌తో పోలీసులు అసలు విషయాన్ని తేల్చారు.
 

న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో ఓ మహిళ టీవీ షో ప్రేరణతో నేరానికి పాల్పడింది. ఓ మహిళను తెచ్చి తన ఫ్లాట్‌లో చంపేసి తానే మరణించినట్టు అందరినీ నమ్మించింది. తన లవర్‌తో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా ఇద్దరు కలిసి నివసిస్తున్నారు. కానీ, మరణించిన మహిళ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులకు ఇవ్వడంతో ఈ కేసు దర్యాప్తు మొదలైంది. పలు అనుమానాలతో గుట్టుగా జీవిస్తున్న ఆ జంటను విచారించగా అసలు విషయం బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితురాలిని పాయల్‌గా గుర్తించారు. గ్రేటర్ నోయిడాకు 15 కిలోమీటర్ల దూరంలోని బాధ్‌పురా నివాసి. ఆమె లవర్ అజయ్ ఠాకూర్. పాయల్ బాధితురాలితో ఫ్రెండ్షిప్ చేసింది. ఆమెకు అజయ్ కూడా తెలుసు. గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ ఏరియాలో ఓ మాల్‌లో పని చేసేది. ఆమె కూడా చూడటానికి పాయల్ తరహాలోనే ఉండేదని నిందితులు పోలీసులకు వెల్లడించిన వివరాల్లో ఉన్నాయి.

Also Read: ఆర్కెస్ట్రాలో పాడుతూ.. అమ్మాయిల మనసు దోచాడు...నాలుగు రాష్ట్రాల్లో ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చివరికి..

ప్లాన్ ప్రకారం ఆ యువతిని పాయల్ ఇంటికి తీసుకెళ్లారు. ఆమె గొంతు కోసి చంపేశారు. ఆమె ముఖంపై యాసిడ్, వేడి నూనె పోసి ఆనవాళ్లు గుర్తించకుండా చేశారు. ఆ బాడీని తన కుటుంబ సభ్యులు తనదే అనుకునేలా చేసి అక్కడి నుంచి పార్ట్‌నర్ అజయ్‌తో కలిసి పారిపోయింది. ఆ డెడ్ బాడీ పాయల్‌దే అనుకుని బంధువులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. 

కానీ, మరణించిన మహిళ కుటుంబ సభ్యులకు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. వారి దర్యాప్తు అసలు ఘటన వైపు సాగింది. పాయల్, అజయ్‌లపై అనుమానంతో వారిని విచారించారు. వారిపై ప్రశ్నల వర్షం కురిపించగా నేరం తామే చేశామని అంగీకరించారు. 

Also Read: ఏసీ, గీజర్ మెకానిక్ తో వచ్చి, రహస్య కెమెరాలు... ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్...

దర్యాప్తులో పాయల్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. పాయల్ తండ్రి తమ బంధువులకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నది. కానీ, ఆ రుణం తిరిగి చెల్లించలేకపోయాడు. మరో దారి లేక పాయల్ తల్లిదండ్రులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు ఆత్మహత్య  తర్వాత పాయల్ తాను మరణించినట్టు నమ్మించాలని నిర్ణయం తీసుకుంది. అందుకే ఒక ప్లాన్ ప్రకారమే ఈ నేరానికి పాల్పడింది. వారి వద్ద నుంచి ఓ కంట్రీ మేడ్ పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

click me!