భారత్ పై ఉగ్రవాదుల కుట్రలు : హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం

By Nagaraju penumalaFirst Published Aug 8, 2019, 11:36 AM IST
Highlights

పంద్రాగస్టు అనే కాకుండా జమ్ముకశ్మీర్ విభజన నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్ పై రగిలిపోతున్నారని తెలిపింది. భారత్ పై దాడులకు తెగబడేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. 

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశంలో హైఅలర్ట్ ప్రకటించింది కేంద్రప్రభుత్వం. 

పంద్రాగస్టు సందర్భంగా దేశంలో 

ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా 

అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సందర్శకుల అనుమతికి నిరాకరించాలని ఆదేశించింది. 

ఇప్పటికే విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని ఎయిర్ పోర్ట్ లలో సందర్శకులకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 10 నుంచి 20 వరకు తాత్కాలికంగా సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. 

విమానశ్రయాల్లో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్ లలో భద్రత కట్టుదిట్టం చేశారు. అన్ని విమానాశ్రయాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. 

పంద్రాగస్టు అనే కాకుండా జమ్ముకశ్మీర్ విభజన నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్ పై రగిలిపోతున్నారని తెలిపింది. భారత్ పై దాడులకు తెగబడేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. 

సామాన్య ప్రజానికమే లక్ష్యంగా విరుచుకుపడేలా ఉగ్రవాద సంస్థలు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశాయి. అంతేకాకుండా జైషే మెహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు సైతం తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  

ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో దేశరాజధాని 

ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. 

ఈ వార్తలు కూడా చదవండి

పంద్రాగష్టు ఎఫెక్ట్: విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు

click me!