Gopal Mandal : అండర్ వేర్ తో రైలు భోగీలో తిరుగుతూ.. అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే...

Published : Sep 03, 2021, 12:07 PM ISTUpdated : Sep 03, 2021, 12:30 PM IST
Gopal Mandal : అండర్ వేర్ తో రైలు భోగీలో తిరుగుతూ.. అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే...

సారాంశం

ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం మీద ఇతర ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. అది వాగ్వాదంగా మారి చివరకు గొడవకు దారితీసింది. ఈ గొడవతో రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF), టికెట్ ఎగ్జామినర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.

న్యూఢిల్లీ : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అండర్ వేర్ మీద రైలు కోచ్ లో తిరుగుతూ తమకు అసౌకర్యం కలిపించాడని తోటి ప్రయాణీకులు ఫిర్యాదు చేశారు. జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ పాట్నా నుండి న్యూఢిల్లీకి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం చేశారు. ఈ సమయంలో ఆయన లో దుస్తులతో మాత్రమే కనిపించారు. దీంతో ఇబ్బంది పడ్డ తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురువారం జరిగింది.

ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం మీద ఇతర ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. అది వాగ్వాదంగా మారి చివరకు గొడవకు దారితీసింది. ఈ గొడవతో రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF), టికెట్ ఎగ్జామినర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.

"ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, టికెట్ ఎగ్జామినర్ ఇరువర్గాలకు రాజీ చేశారు" అని తూర్పు మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) రాజేష్ కుమార్ అన్నారు.

తన కడుపు పాడయ్యిందని అందుకే హడావుడిగా అలా వెళ్లాల్సి వచ్చిందని మండల్ అన్నారు. "నేను అండర్ వేర్, బనీన్ లో ఉన్నాను. అప్పుడే రైలు ఎక్కాను. కడుపు నొప్పి వచ్చింది. నేను అబద్ధం చెప్పను" అని ఎమ్మెల్యే చెప్పారు. తెల్లటి చేతుల్లేని బనీన్ తో రైలు కోచ్‌లో ఎమ్మెల్యే తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా షేర్ అయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport