కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (union finance minister nirmala sitharaman) గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలోని కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ (300 units electricity) అందించేందుకు రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ (Roof top solar setups) ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. అందులో మధ్య తరగతి ప్రజలపై చాలా ప్రభావం చూపే విద్యుత్ పై కీలక ప్రకటన చేశారు. దేశంలోని కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ వచ్చే ఏర్పాటు చేస్తామని తెలిపాు.
రామమందిరం ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోడీ చెప్పిన ప్రణాళికను అనుసరించి రూఫ్ టాప్ సోలారైజేషన్ తో ప్రతి నెలా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ లభిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇలా చేయడం వల్ల ప్రతీ నెలా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ అందుతుంది. దీని వల్ల ప్రతీ కుటుంబానికి ఏటా రూ.15-18 వేలు ఆదా అవుతాయని చెప్పారు. ఇళ్లపై ఏర్పాటు చేసుకున్న రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ను కుటుంబం మొత్తం వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మిగిలిన విద్యుత్ ను విద్యుత్ పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు. దీని ద్వారా కూడా ఆదాయం లభిస్తుందని తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఆరోగ్య కార్యకర్తలకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆరోగ్య సంరక్షణ కవరేజీని ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లందరికీ వర్తింపజేస్తామని తెలిపారు. అలాగే మాతాశిశు ఆరోగ్య సంరక్షణ: మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కింద వివిధ పథకాలను సమగ్ర కార్యక్రమంగా క్రోడీకరించి అమలులో సమన్వయాన్నిపెంపొందించనున్నట్టు వెల్లడించారు. అంగన్ వాడీ, పోషణ్ 2.0 కింద అంగన్ వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడం ద్వారా పౌష్టికాహారం అందిస్తామని, బాల్య సంరక్షణ, అభివృద్ధిని మెరుగుపరుస్తామని చెప్పారు.