కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటారని.. పురీషనాళంలో కిలో బంగారం దాచాడు

By Arun Kumar PFirst Published Sep 14, 2018, 12:12 PM IST
Highlights

ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎంతగా నిఘా పెడుతున్న స్మగ్లర్లు స్మగ్లింగ్ చేయడానికి కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఏకంగా స్మగ్లింగ్‌కు తన పురీషనాళాన్నే సాధనంగా చేశాడు ఓ వ్యక్తి.

ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎంతగా నిఘా పెడుతున్న స్మగ్లర్లు స్మగ్లింగ్ చేయడానికి కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఏకంగా స్మగ్లింగ్‌కు తన పురీషనాళాన్నే సాధనంగా చేశాడు ఓ వ్యక్తి.

సోమవారం దుబాయ్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ యువకుడి ప్రవర్తన అనుమానంగా ఉండటంతో.. కస్టమ్స్ అధికారులు అతన్ని రహస్యంగా తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా పాయువులో దాచిన బంగారు కడ్డీలు గుర్తించారు.

అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రూ.32 లక్షల విలువ చేసే .. 1.04 కిలోల బరువైన తొమ్మిది బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న చెన్నైకి చెందిన ఒక వ్యక్తిని, ఫ్రాన్స్ జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల బంగారు కడ్డీ, 5 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
 
click me!