Old Monk Tea: తందూరీ చాయ్‌లో ఓల్డ్ మంక్ రమ్ పోసి అమ్ముతున్న గోవా వ్యాపారి.. వీడియో వైరల్

Published : Nov 05, 2022, 07:27 PM IST
Old Monk Tea: తందూరీ చాయ్‌లో ఓల్డ్ మంక్ రమ్ పోసి అమ్ముతున్న గోవా వ్యాపారి.. వీడియో వైరల్

సారాంశం

గోవాలో కొత్తగా ఓల్డ్ మంక్ టీ అనే కొత్త రకం టీ వెలుగులోకి వచ్చింది. ఆ టీ వెండర్ ఓల్డ్ మంక్ టీ ప్రిపేర్ చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నది.  

న్యూఢిల్లీ: టూర్ ప్లాన్‌లు ఎవరు వేసినా ఆ జాబితాలో గోవా కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే.. గోవా పర్యాటకులకు ఫేవరేట్ స్పాట్. ఇక్కడి బీచ్‌లే కాదు.. షాపింగ్, డైనింగ్ కోసమూ చాలా మంది వెళ్లుతుంటారు. రకరకాల రుచులు ముఖ్యంగా డ్రింక్‌లపై ఇష్టాలతో ఎక్కువగా వెళ్లుతుంటారు. అదీ, అక్కడి లోకల్ రుచులను ఆస్వాదించాలని చాలా మంది ఉబలాటపడుతుంటారు. ఇలాంటి గోవా నుంచే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. టీ అమ్ముకునే వ్యాపారికి చెందిన వీడియో అది. అందులో టీలో ఓల్డ్ మంక్ రమ్ పోసి అమ్ముతున్నాడు.

తందూరీ టీ విధానాన్ని పాటించాడు. నిప్పులో నుంచి టీ కప్ తీసి అందులో తొలుత కొంత బెల్లపు పౌడర్ యాడ్ చేశాడు. ఆ తర్వాత అందులో ఓల్డ్ మంక్ రమ్ కొద్దిగా యాడ్ చేశాడు. ఇక సాధారణ తందూరీ టీ చేసినట్టుగానే మిగతా వస్తువులు కూడా అందులో యాడ్ చేశాడు. ఈ ఓల్డ్ మంక్ టీ గోవాలోని సింక్వెరిమ్ బీచ్ వద్ద లభించనుంది.

Also Read: వైరల్ వీడియో: పెళ్లిలో భార్యతో డ్యాన్స్ చేయాలనుకున్నాడు..కానీ..!

ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్టు చేశాడు. ఈ పోస్టుకు భిన్నమైన స్పందన వచ్చింది. కొందరు ఈ కొత్త రకం టేస్ట్ పై ఆసక్తి చూపగా.. కొందరు మాత్రం ఇలాంటి వాటిని చాలించండి.. గతంలో పన్నీర్ లాగే.. ఇప్పుడు ఓల్డ్ మంక్‌ను కూడా అన్నింటిలో కలిపేస్తారా? ఏంటీ? అంటూ మరొకరు కామెంట్ చేశారు.

ఇది బ్రిలియంట్ అంటూ ఒకరు ట్వీట్ చేయగా.. కొందరేమో ఇలాంటి నాన్సెన్స్‌ను గోవాకు ముడిపెట్టకండి అంటూ కామెంట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM