గోవాలో కాంగ్రెస్ లో సంక్షోభం: బీజేపీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు

By Nagaraju penumalaFirst Published Jul 11, 2019, 5:55 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 5కి పడిపోయింది. ఇకపోతే బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం తమ శాసన సభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలంటూ స్పీకర్, గవర్నర్ లను కోరనున్నట్లు సమాచారం. 
 
గోవా: కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే కర్ణాటక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. గోవా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో 10 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గోవా గవర్నర్ సీఎం ప్రమోద్ సవాంత్ సైతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. 

click me!