గర్భం దాల్చిన ప్రభుత్వ హాస్టల్ బాలికలు

By telugu teamFirst Published Jul 2, 2019, 11:03 AM IST
Highlights

ప్రభుత్వ హాస్టల్స్ లో ఉంటూ విద్యనభ్యసించే నలుగురు విద్యార్థులు గర్భం దాల్చడం కలకలం రేపింది. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లో చోటుచేసుకుంది.

ప్రభుత్వ హాస్టల్స్ లో ఉంటూ విద్యనభ్యసించే నలుగురు విద్యార్థులు గర్భం దాల్చడం కలకలం రేపింది. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లో బాలికల వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. వీటిలోని రెండు హాస్టళ్లలో నలుగురు విద్యార్థులు గర్భం దాల్చినట్లు వైద్యులు గుర్తించారు. 

ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) నుంచి తమకు నివేదిక అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనూప్ సాహూ వెల్లడించారు. విద్యార్థులు వేసవి సెలవలకు ఇంటికి వెళ్లి తిరిగి స్కూల్లు తెరిచేసరికి హాస్టల్ కి వచ్చారని అధికారులుచెబుతున్నారు. విద్యార్థులు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించగా... వారిలో నలుగురు గర్భం దాల్చారని తేలింది.

కాగా విద్యార్థులు గర్భం దాల్చడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.  ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని అధికారులు చెప్పారు. 
 

click me!