మార్నింగ్ వాక్ చేస్తుంటే.. బీజేపీ ఎమ్మెల్యే బంధువు హత్య..

Bukka Sumabala   | Asianet News
Published : Oct 09, 2020, 10:44 AM IST
మార్నింగ్ వాక్ చేస్తుంటే.. బీజేపీ ఎమ్మెల్యే బంధువు హత్య..

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో ఓ బీజేపీ ఎమ్మెల్యే బంధువును శుక్రవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు గన్ తో కాల్చి పారిపోయారు. వివరాల్లోకి వెడితే..

మృతుడు మురాద్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అజిత్ పాల్ త్యాగి సమీప బంధువు.   శుక్రవారం ఉదయం ఘజియాబాద్ లోని తన ఇంటి సమీపంలోని సిహానిగేటు వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. 

దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఎందుకు హత్యకు కారణాలేమిటన్న విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

బాధితుడు మురద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే అజిత్ పాల్ త్యాగి బంధువు కావడంతో ఉద్రిక్తత నెలకొంది. కాల్పుల ఘ‌ట‌న‌తో స‌ద‌రు ఎమ్మెల్యేకి సైతం భ‌ద్ర‌త పెంచారు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !