రాజకీయాల్లోకి మరో క్రికెటర్

Published : Aug 18, 2018, 06:02 PM ISTUpdated : Sep 09, 2018, 01:33 PM IST
రాజకీయాల్లోకి మరో క్రికెటర్

సారాంశం

రాజకీయాల్లోకి మరో భారత క్రికెటర్‌ అడుగుపెట్టబోతున్నాడంటూ వార్తలు జోరుగా వినబడుతున్నాయి. పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. నియోజకవర్గం సైతం చెప్తున్నారు..ఇంతకీ ఎవరా క్రికెటర్ అనుకుంటున్నారా.....ఏ పార్టీ నుంచి పోటీ చెయ్యబోతున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా....ఇంకెవరు ఢిల్లీ క్రికెటర్ర గౌతమ్ గంభీర్. 

ఢిల్లీ: రాజకీయాల్లోకి మరో భారత క్రికెటర్‌ అడుగుపెట్టబోతున్నాడంటూ వార్తలు జోరుగా వినబడుతున్నాయి. పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. నియోజకవర్గం సైతం చెప్తున్నారు..ఇంతకీ ఎవరా క్రికెటర్ అనుకుంటున్నారా.....ఏ పార్టీ నుంచి పోటీ చెయ్యబోతున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా....ఇంకెవరు ఢిల్లీ క్రికెటర్ర గౌతమ్ గంభీర్. 

భారత క్రికేట్ టీంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్‌ గంభీర్‌ త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే బీజేపీకి చెందిన ఓ నేత స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీపై ఉన్నవ్యతిరేకతను రూపుమాపుకునేందుకు భాజపా వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని వ్యూహాలు రచిస్తోందట. 

అందులో భాగంగా క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ను బరిలోకి దించాలని చూస్తోందట. పశ్చిమ ఢిల్లీ నుంచి గంభీర్‌ను పోటీలోకి దింపాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ భారత్‌ తరఫున 2013లో చివరి వన్డే ఆడగా గత ఏడాది రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో గంభీర్‌ చివరి సారిగా కనిపించాడు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌