Asad Ahmed Encounter: తండ్రి కాన్వాయ్ పై దాడికి యత్నించిన అసద్, కానీ... సంచలన విషయాలు వెలుగులోకి .. 

Published : Apr 14, 2023, 02:28 PM ISTUpdated : Apr 14, 2023, 02:30 PM IST
Asad Ahmed Encounter: తండ్రి కాన్వాయ్ పై దాడికి యత్నించిన అసద్,  కానీ...  సంచలన విషయాలు వెలుగులోకి .. 

సారాంశం

Asad Ahmed Encounter: ఎమ్మెల్యే ఉమేష్ పాల్ హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ , సహచరుడు ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం నాడు ఝాన్సీలో ఎన్‌కౌంటర్‌ చేసి హతమార్చారు. ఈ ఎన్‌కౌంటర్‌ తర్వాత అసద్ చేసిన కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. 

Asad Ahmed Encounter: ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడు, మాఫియా డాన్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్, అతని సహచరుడు గులామ్ లను యూపీ పోలీసులు ఝాన్సీలో ఎన్‌కౌంటర్ చేసి హతమారించిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ తరువాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కాన్వాయ్‌పై దాడి చేయడానికి అసద్ అహ్మద్,అతని సహచరుడు గులామ్ లు ప్రయత్నించారనీ,  కాన్వాయ్‌పై కొన్ని రౌండ్లు కాల్పులు జరపాలని నిఘా సంస్థలు తెలిపాయి. అయితే.. వాస్తవానికి కాన్వాయ్‌కి భద్రత పఠిష్టంగా ఉండటంతో అతిక్ అహ్మద్ ను తప్పించాలనే ప్లాన్ ను విరమించుకున్నారనీ, కానీ పోలీసులను, భద్రతా సిబ్బందిని ఇబ్బంది పెట్టడానికి రెండు రౌండ్లు మాత్రమే కాల్చాలని  ప్లాన్ చేసుకున్నారని వర్గాలు తెలిపాయి. కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన ఘటన సంచలనంగా వ్యాప్తి చెందాలని, యూపీ ప్రభుత్వం అప్రతిష్టపాలు కావాలని, దీనితో పాటు, అతిక్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాలని ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. 

ఇదే సమయంలో మరో సంచలన బయటపడింది. ఉమేష్ పాల్ హత్య కేసు తర్వాత హంతకుడు అసద్, షూటర్ గులామ్‌ను సురక్షితంగా ఉంచడం అతిక్, అష్రాఫ్‌లకు సవాలుగా మారిందనీ, అతడిని దాచిపెట్టేందుకు అతిక్ తనకు తెలిసిన కొందరి సహాయం కూడా తీసుకున్నాడని వర్గాలు తెలిపాయి.

ఉమేష్ పాల్ ఫిబ్రవరి 24న  హత్యకు గురికాగా.. ఆ తర్వాత అసద్ ఒకరోజు ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఇంట్లో తలదాచు కున్నాడని పోలీసులు వర్గాలు తెలిపారు. ఆ తర్వాత ఫిబ్రవరి 26న బైక్‌పై కాన్పూర్‌కు వచ్చాడు. అక్కడి నుంచి ఫిబ్రవరి 28న బస్సులో ఢిల్లీలోని ఆనంద్ విహార్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఢిల్లీలోని జామియా నగర్‌, సంగమ్‌ విహార్‌లో బస చేశారు. అనంతరం .. అసద్ మార్చి 15న అజ్మీర్‌కు బయలుదేరాడు. తర్వాత అక్కడి నుంచి ముంబై వెళ్లి అక్కడి నుంచి నాసిక్ చేరుకున్నాడు. ఆ తర్వాత కాన్పూర్ వెళ్లి ఝాన్సీకి వచ్చాడు. 

ఇలా హంతకుడు అసద్ దాదాపు 2 నెలల పాటు 6 నగరాల్లో తలదాచుకుంటున్నటు పోలీసులు తెలిపారు. అతను ఎప్పుడూ రైలులో ప్రయాణించలేదనీ,  చాలా వరకు బస్సు లేదా ఇతర వాహనాల్లో ప్రయాణించాడు. ఈ సమయంలో ఆయన దాదాపు 4000 కిలోమీటర్లు ప్రయాణించారని తెలుసు తెలిపారు. 

అలాగే.. ఈ సమయంలో హైదర్ అనే వ్యక్తి ఢిల్లీలో తలదాచుకోవడానికి సహకరించాడు. ప్రస్తుతం బరేలీ జైలులో ఉన్నారు. హైదర్‌కు తెలిసిన ముగ్గురిని ఢిల్లీ నుంచి అరెస్టు చేశారు.ఫైనల్ గా ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సిబ్బంది సంయుక్తంగా  ఝాన్సీలో జరిపిన ఎన్‌కౌంటర్‌లో అసద్,  అతని సహాయకుడిని హతమార్చడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్