రాజస్థాన్ లో కోర్టు వద్దే గ్యాంగ్ స్టర్ పై కాల్పులు: అక్కడికక్కడే మృతి చెందిన సేథీ

By narsimha lodeFirst Published Sep 19, 2022, 7:31 PM IST
Highlights

రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లా కోర్టు వద్ద  ఇవాళ గ్యాంగ్ స్టర్ ను కాల్చి చంపారు దుండగులు. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ సందీప్ సేథీ అక్కడికక్కడే మరణించాడు.  కోర్టుకు సేథీ హజరైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

జైపూర్: కోర్టుకు హజరౌతున్న గ్యాంగ్ స్టర్ ను గుర్తుతెలియని దుండగులు సోమవారం నాడు కాల్చి చంపారు. ఈ ఘటన రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో జరిగింది. ఈ నెల 12వ తేదీ నుండి బెయిల్ పై ఉన్న గ్యాంగ్ స్టర్ సందీప్ సేధీ ఇవాళ తన స్నేహితులతో కలిసి నాగౌర్ జిల్లా కోర్టుకు విచారణకు వచ్చారు. కోర్టుకు సేథీ చేరుకొన్న వెంటనే మోటార్ బైక్ లపై వచ్చిన నలుగురైదుగురు వ్యక్తులు అతనిపై కాల్పులకు దిగారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

సేథీపై పలు పోలీస్ స్టేషన్లలో 25 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని  అడిషనల్ ఎస్పీ  రాజేష్ మీనా చెప్పారు. సేథీపై నిందితులు సుమారు 9 నుండి 10 రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పారు. సేథీ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగౌరో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోర్టు వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీ ద్వారా హంతకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అడిషనల్ ఎస్పీ చెప్పారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. 

click me!