యూపీ మీరట్‌లో ఎన్ కౌంటర్: గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానా మృతి

Published : May 04, 2023, 03:53 PM ISTUpdated : May 04, 2023, 04:00 PM IST
యూపీ మీరట్‌లో ఎన్ కౌంటర్: గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానా మృతి

సారాంశం

ఉత్తర్ ప్రదేశ్ లో  గ్యాంగ్ స్టర్  అనిల్ దుజానా  ఇవాళ ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. 

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని   మీరట్ లో  గురువారంనాడు గ్యాంగ్ స్టర్  అనిల్ దుజానా ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. పశ్చిమ యూపీకి  చెందిన  కరుడు గట్టిన  అనిల్ దుజానాను  2021  ఢిల్లీ పోలీసులు  పట్టుకున్నారు. అనిల్ దుజానాపై  హత్యలు,  దోపీడీలు, భూకబ్జాలు వంటి కేసులు నమోదయ్యాయి.  దుజానాపై  62 కేసులున్నాయి.  అనిల్  దుజానాపై బులంద్ షహర్  పోలీసులు  రూ. 25 వేలు, నోయిడా పోలీసులు రూ. 50 వేల రివార్డును  ప్రకటించారు.  2012 నుండి  అనిల్ దుజానా  జైలులో ఉన్నాడు.  2021లో  ఆయన బెయిల్ పై విడుదలయ్యాడు. బెయిల్ పై విడుదలైన తర్వాత  పాత కేసుల్లో కోర్టుకు హాజరు కాకపోవడంతో  నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. 
 

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu