ప్రయాణం మొదలైన మూడో రోజే గంగా విలాస్ క్రూయిజ్‌కు ఆటంకం.. నదీలోతు తగ్గిపోవడంతో బిహార్‌లో ఒడ్డుకు చేరని క్రూయిజ్

By Mahesh KFirst Published Jan 16, 2023, 7:30 PM IST
Highlights

గంగా విలాస్ క్రూయిజ్ వారణాసిలో తన ప్రయాణం ప్రారంభించిన మూడో రోజే బిహార్‌లోని ఛాప్రాలో ఒడ్డుకు చేరలేకపోయింది. ఇక్కడ చిరండ్ సరన్‌ను ప్రయాణికులు పర్యటించాల్సి ఉన్నది. కానీ, డోరిగంజ్ ఏరియాలో నదీ లోతు తగ్గిపోయింది. దీంతో క్రూయిజ్ ఒడ్డుకు చేరలేకపోయింది. దీంతో ఎస్‌డీఆర్ఎప్ బృందం చిన్న పడవల సహాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చింది.
 

పాట్నా: గంగా విలాస్ క్రూయిజ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రూయిజ్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. యూపీలోని వారణాసి నుంచి అసోంలోని దిబ్రుగడ్ వరకు (51 రోజులు) ప్రయాణించే ఈ క్రూయిజ్‌లో దారి మధ్యలో వచ్చే చారిత్రక ప్రదేశాలను ప్రయాణికులకు చూపిస్తుంది. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులను ఒడ్డుకు చేరుస్తుంది. కానీ, ఈ క్రూయిజ్ వారణాసిలో ప్రయాణం ప్రారంభించిన మూడో రోజుకే బిహార్‌లో నదీ లోతు తగ్గడం మూలంగా ఒడ్డుకు చేరలేకపోయింది.

బిహార్‌లోని ఛాప్రాకు చేరిన తర్వాత గంగా నదీ లోతు తగ్గిపోయింది. ఛాప్రాలో ప్రయాణికులను ఈ క్రూయిజ్ ఒడ్డుకు చేర్చాల్సి ఉన్నది. ఇక్కడ ఆర్కియలాజికల్ సైట్ చిరండ్ వంటివి ఉన్నాయి. ఇందుకోసం షెడ్యూల్ ప్రకారం గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణికులను డోరిగంజ్ ఏరియాలో ఒడ్డుకు చేర్చాలి. కానీ, ఇక్కడ నదీ లోతు తక్కువ ఉండటంతో ఆ పని చేయలేకపోయింది. చాప్రా నుంచి ఆ సైట్ 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Also Read: విలాసవంతమైన గంగా విలాస్ క్రూయిజ్, టెంట్ సిటీని ప్రారంభించిన ప్రధాని మోడీ.. వీటి విశేషాలేమిటంటే ?

క్రూయిజ్ ఒడ్డుకు చేరలేకపోతున్నదన్న విషయం తెలియగానే ఎస్‌డీఆర్ఎఫ్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. చిన్న చిన్న బోట్‌ల సహాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చింది. ప్రయాణికులను ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చిరండ్ సరన్‌ను చేర్చడంలో దోహడపడింది.

ప్రయాణికులను చిరండ్ చేరడంలో తగిన ఏర్పాట్లు చేయగలిగామని ఛాప్రా సీవో సతేంద్ర సింగ్ వివరించారు. ఎస్‌డీఆర్ఎప్ టీమ్ ఘాట్ దగ్గరే ఉంచామని, ఎలాంటి అవసరానికైనా వారిని సిద్ధంగా ఉంచామని తెలిపారు. 

click me!