అవి పాటించలేదని.. స్వయంగా కలెక్టరే కర్ర పట్టుకునిపరిగెత్తించి కొట్టాడు..

Published : Apr 19, 2021, 09:19 AM IST
అవి పాటించలేదని.. స్వయంగా కలెక్టరే కర్ర పట్టుకునిపరిగెత్తించి కొట్టాడు..

సారాంశం

స్వయంగా కలెక్టర్, సబ్ కలెక్టర్ రంగంలోకి దిగి కర్రలతో జనాల్ని పరిగెత్తించి కొట్టిన సంఘటన పర్లాకిమిడిలో జరిగింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులనుంచి కోవిడ్ నిబంధలను ఉల్లంఘించి వస్తున్న వారిని పరిగెత్తించి పరిగెత్తించి కొట్టారు.

వివరాల్లోకి వెడితే.. రోజురోజుకు గజపతి జిల్లా కేంద్రం పర్లాకిమిడిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. స్థానిక మహేంద్రతనయ వంతెన వద్ద ఆంధ్రా-ఒడిశా సరిహద్దు మూసేశారు.

 స్వయంగా కలెక్టర్ అనుపమ కుమార్ సాహా,  సబ్‌కలెక్టర్‌ సంగ్రాం కేసరి పండాలు శనివారం కర్ర చేతపట్టుకుని.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని, పాతపట్నం (ఆంధ్రప్రదేశ్‌) నుంచి జిల్లాలోకి వచ్చేవారిని తరిమి కొట్టారు

విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి వచ్చే బస్సులు సరిహద్దుల్లో పాతపట్నం డిపో వద్ద నిలిపి వేయడంతో అనేకమంది ఒడిశాకు రావాలనుకునేవారు కాలినడకన వచ్చి... ఒడిశా అధికారులకు తమ కాగితాలను చూపించి పర్లాకిమిడి పట్టణానికి రావాల్సి వచ్చింది.

మహిళలు లగేజీ మోయలేక, ఆటోలు లేక ఇబ్బందులు పడ్డారు. నాకు పాయింట్ల వద్ద విడిచిపెట్టకపోవడంతో ఉపాధి కూలీలు స్వస్థలాలకు రాలేక అవస్థలు పడ్డారు. జిల్లాలో రాత్రి కత్తులు విధించారు. జిల్లాకు వచ్చే ఆంధ్ర సరిహద్దులనాకాపాయింట్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..