24 గంటల్లో మరోసారి జీ 23 నేతల భేటీ: ఆజాద్ నివాసంలో అసమ్మతి నేతల సమావేశం

Published : Mar 17, 2022, 09:39 PM ISTUpdated : Mar 17, 2022, 09:53 PM IST
24 గంటల్లో మరోసారి జీ 23 నేతల భేటీ: ఆజాద్ నివాసంలో అసమ్మతి నేతల సమావేశం

సారాంశం

jజీ 23 నేతలు గురువారం నాడు మరోసారి సమావేశమయ్యారు. 24 గంటల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి నేతలు సమావేశం కావడం చర్చకు దారి తీసింది. 

న్యూఢిల్లీ:  Congress పార్టీలో అసమ్మతి నేతలుగా ముద్రపడిన  G-23  నేతలు గురువారం నాడు రాత్రి Ghulam Nabi Azad నివాసంలో సమావేశమయ్యారు. 24 గంటల వ్యవధిలో జీ 23 నేతలు సమావేశం కావడం ఇది రెండో సారి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారని సమాచారం.

మరో వైపు హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా జీ 23 నేతల సమావేశంలో చర్చించిన అంశాలపై పార్టీ మాజీ అధ్యక్షుడు Rahul Gandhi తో ఇవాళ చర్చించారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆజాద్ నివాసంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఆజాద్, భూపేందర్ సింగ్ హుడా, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ తదితరులు భేటీ అయ్యారు.

నిన్న జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంపై నేతలు విశ్వాసం వ్యక్తం చేయలేదు. పార్టీ నాయకత్వంలో మార్పులు చేయాల్సిందేనని  జీ 23 నేతలు డిమాండ్ చేస్తున్నారు.

పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని జీ 23 నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీ చుట్టూ ఉన్న నేతల తీరుతోనే పార్టీ తీవ్రంగా నష్టపోతోందనే అభిప్రాయాలను కూడా అసమ్మతి నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి  గాంధీ కుటుంబం తప్పుకోవాలలని కపిల్ సిబల్ చేసిన డిమాండ్ ను సోనియా వర్గం తప్పుబడుతుంది.

ఐదు రాస్ట్రాల్లో వచ్చిన ఫలితాలు జీ 23 నేతలకు అస్త్రంగా మారాయి. దీంతో సోనియాపై మరింత ఒత్తిడిని తీసుకు వస్తున్నారు. పార్టీలో సంస్థాగతంగా మార్పుల కోసం పట్టుబడుతున్నారు. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని  కూడా అసమ్మతి నేతలు కోరుతున్నారు.

గత ఆదివారం నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించారు.. ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను రాజీనామాలు చేయాలని కూడా సోనియా గాంధీ ఆదేశించారు. దీంతో ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామాలు చేశారు. 

సీడబ్ల్యూసీ  సమావేశానికి ముందు ఈ నెల 11వ తేదీన జీ 23 నేతలు సమావేశమయ్యారు..ఈ నెల 11వ తేదీన New Delhi లోని జీ 23కి నాయకత్వం వహిస్తున్న Ghulam Nabi Azad నివాసంలో కపిల్ సిబల్, మనీష్ తివారీ తదితరులు భేటీ అయ్యారు. ఆ సమావేశం తర్వాత ఇవాళ మరోసారి వీరంతా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో ఓటమి పాలైంది.  మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. అయితే మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంతో  ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని చేపట్టింది.

దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితమైంది.  పంజాబ్ రాష్ట్రంలో  అధికారాన్ని కోల్పోయింది. ఆ పార్టీ నాయకత్వం వహించిన తీరుతో కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. పంజాబ్ రాష్ట్రంలో   ఆప్ తొలిసారిగా అధికారాన్ని  చేపట్టింది.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu