ఫ్రమ్ ది ఇండియా గేట్: బాబాయ్ తిరిగొచ్చాడు, బాబాతో రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో కలవరం..

By Asianet NewsFirst Published Dec 25, 2022, 5:32 PM IST
Highlights

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక పరిణామాలను, రాజకీయ పక్షాల వ్యుహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. అధికారం ఉన్నచోట తెరవెనుక చాలా జరుగుతాయి. అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు.. ఇలా చాలా ఉంటాయి. ఈ  పరిణామాలను, రాజకీయ పక్షాల వ్యుహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బాబాయ్ తిరిగొచ్చాడు.. 
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుటుంబంలో నెలకొన్ని ఒడిదుడుకులు సుఖాంతం దిశగా సాగుతున్నాయి. చాలా కాలంగా అఖిలేష్ యాదవ్‌కు, ఆయన  బాబాయ్ శివపాల్ యాదవ్‌కు మధ్య దూరం ఉన్న సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌‌ యాదవ్‌తో తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కలేదని శివపాల్ ఎప్పుడూ పోరాడుతూనే ఉండేవారు. ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన శివపాల్ యాదవ్ ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. 

ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారిద్దరు కలిసినట్టుగా అనిపించినప్పటికీ.. అంతా సయోధ్య మాత్రం  కుదరలేదు. అయితే ఇటీవల ములాయం సింగ్‌‌ యాదవ్‌ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ సమాజ్‌వాద్ పార్టీ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ  ఉప ఎన్నిక ప్రచార సమయంలో అఖిలేష్.. శివపాల్ యాదవ్ పాదాలకు నమస్కరించారు. అయితే డింపుల్ ఘన విజయం సాధించడంలో అఖిలేష్ బాబాయి కూడా కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. డింపుల్ యాదవ్ విజయం తర్వాత బాబాయ్‌ను తిరిగి పార్టీలో చేరాల్సిందిగా అఖిలేష్ యాదవ్ బహిరంగ ఆహ్వానం పలికారు. అలాగే పార్టీ గుర్తుతో కూడిన కార్డును కూడా బాబాయ్ చేతిలో ఉంచారు. దీంతో అఖిలేష్ కుటుంబంలో ఒడిదుడుకులు సమసిపోయినట్టుగానే అంతా భావిస్తున్నారు. వీరు ఉమ్మడిగా ఎస్పీ తరఫున 2024 లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు సాగుతారని అనుకుంటున్నారు. 

రాళ్లు వేయడం.. మరోసారి విజయవంతమైన ఫార్ములా.. 
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టమే. ఇలాంటి సందర్భంలో ప్రధానంగా సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్‌ గురించి చెప్పుకోవాలి. తిరిగి తన మాజీ మిత్రుడికి(బీజేపీ)కి ఓం ప్రకాష్ దగ్గరయ్యాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ఫౌండేషన్ కో-ఛైర్మన్‌గా ఓం ప్రకాష్ నియమితులు కావడంతో.. అందుకు మరింతగా బలం చేకూర్చినట్టయింది. తద్వారా ఓం ప్రకాష్ తన వ్యతిరేక శిబిరం యొక్క గేట్లను అన్‌లాక్ చేయడానికి అనుసరిస్తున్న వ్యుహాం మరోసారి విజయవంతమైందనే చెప్పాలి. 

తనకు తగిన గౌరవం లభించడం లేదని భావించిన క్షణంలో ఓం ప్రకాష్.. తనతో ఉన్న నాయకులపై బహిరంగంగా విమర్శలు ప్రారంభిస్తారు. ఆయన గత ప్రభుత్వంలో (2017 నుంచి 2019 వరకు) మంత్రిగా ఉన్నప్పుడు వ్యతిరేక శిబిరం నుంచి ఆకర్షించబడేందుకు..  వారికి చెందిన సభ్యులపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రతిపక్ష ఎస్పీకి దగ్గరయ్యాడు. ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తుపెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత ఎస్పీ కూటమి నుంచి బయటకు వచ్చి.. అఖిలేష్‌పై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన  తిరిగి బీజేపీకి దగ్గరయ్యాడు. మరి ఈ ఎరను ఏదైనా పెద్ద చేప మింగేస్తుందా అనేది 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మాత్రమే తెలుస్తుంది.

ఆయన పేరే బాబా.. 
రాజస్తాన్ ప్రభుత్వాన్ని ఈ పేరు తీవ్రంగా కలవరపెట్టింది. బాబాగా పేరుగాంచిన బీజేపీ సీనియర్ నాయకుడు.. రాహుల్ గాంధీ యాత్ర సందర్భంగా ఎటువంటి రచ్చ చేస్తాడోనని రాజస్తాన్‌లోని అధికార కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది. అందుకు కారణం ఆ బాబా.. మొండి వైఖరి, రెచ్చగొట్టే వైఖరి ఎలా గొప్ప ప్రణాళికలను అయిన స్వల్పంగా పాడుచేయగలేదు. ఈ క్రమంలోనే అతని నియోజకవర్గం గుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగాల్సి ఉన్న నేపథ్యంలో.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఆయన ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి, కెమెరాల ఏర్పాటుకు, కమ్యూనిటీ భవనాల మరమ్మతులకు దాదాపు రూ.20 లక్షలు వెచ్చించింది. దీంతో రాహుల్ యాత్ర అల్వార్‌లోని దౌసా గుండా సాఫీగా సాగేలా చేసింది. అయితే దీనిపై బాబా గానీ, ఆయన అనుచరులు గానీ ఎటువంటి స్పందన లేదు. 

అధికారం కోసం.. 
భారత్ జోడో యాత్ర యొక్క రాజస్థాన్ సాగుతున్న సమయంలో ఓ మహిళా నాయకురాలు ఎంట్రీ రాజకీయంగా విపరీతమైన చర్చకు దారితీసింది. ఈ మహిళా నాయకురాలు.. గతంలో దెబ్బతిన్న తన కుటుంబ రాజకీయ ప్రతిష్టను పునర్నిర్మించాలనే లక్ష్యంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ జోడో యాత్రలో ఆమె రాహుల్ గాంధీకి దగ్గరగా ఐదుసార్లు కనిపించింది. మరోవైపు సోనియా గాంధీతో సెల్ఫీ కూడా దిగింది. ఆమె రాజకీయ ఎత్తుగడలు బలంగా ఉంటాయనే అంటారు. భవిష్యత్తులో ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పరిగణించబడవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌లో ఇచ్చే చేయి వరాన్ని కూడా లాగేసుకుంటుంది అనేది తరచుగా అనధికారికంగా వినిపించే మాట. 

రెడ్ కార్డు.. 
కేరళ సీపీఎం‌లో జయరాజన్ వర్సెస్ జయరాజన్ పోరు మరోసారి తీవ్రమైంది. సీపీఎం కన్నూర్‌ ఫైర్‌బ్రాండ్‌ నేత పీ జయరాజన్‌ తన పార్టీ సహచరుడు ఈపీ జయరాజన్‌పై తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈపీ జయరాజన్ కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా కావాలని భావించారు. అయితే ఆ స్థానంలో ఎంవీ గోవిందన్ నియమితులయ్యారు. అయితే ఈ పరిణామాలపై ఈపీ జయరాజన్ కొంత కలతచెందారనే ప్రచారం ఉంది. అయితే ఇటువంటి సమయంలో సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, కేరళలోనే ఎల్‌డిఎఫ్ కన్వీనర్‌ అయిన ఈపీ జయరాజన్‌పై పీ జయరాజన్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

తన చిత్తశుద్ధి, కమ్యూనిస్ట్ నీతికి ప్రసిద్ధి చెందిన పి జయరాజన్.. కేరళలోని ఒక ఆయుర్వేద రిసార్ట్ ప్రాజెక్ట్‌లో ఈపీ జయరాజన్, ఆయన కొడుకు ప్రమేయం ఉందని ఆరోపించారు. ఆరోపణను లిఖితపూర్వకంగా సమర్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ సూచించారని, ఈ ఆరోపణలు యథార్థతతో చేస్తున్నాయని పీ జయరాజన్‌ అన్నారు. ఇక, ఈ పరిణామంపై సీపీఎం కేంద్ర కమిటీ కూడా నివేదిక కోరింది. దీంతో పార్టీ పరిశీలకులు ఎలాంటి నిర్ణయం తీసుకోంటారో.. ఎవరికైనా రెడ్ కార్డు చూపెడతారా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయంశంగా మరింది.

click me!