ఫ్రమ్ ది ఇండియా గేట్: కేరళలో ‘‘మార్క్‌’’వాదం.. చంద్రబాబు కలలు.. కాంగ్రెస్‌లో ఎడారి తుఫాన్..

Published : Jun 11, 2023, 12:00 PM ISTUpdated : Jun 11, 2023, 12:01 PM IST
ఫ్రమ్ ది ఇండియా గేట్: కేరళలో ‘‘మార్క్‌’’వాదం.. చంద్రబాబు కలలు.. కాంగ్రెస్‌లో ఎడారి తుఫాన్..

సారాంశం

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..   

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కేరళలో ‘‘మార్క్‌’’వాదం..
కేరళలో ఇద్దరు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు స్కామ్‌లలో చిక్కుకోవడంతో కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ట్రోల్స్ సునామీలో మునిగిపోయింది. ఎర్నాకులం మహారాజా కళాశాల క్యాంపస్‌లోని ప్రముఖ ముఖమైన ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు అర్షో ఎప్పుడూ హాజరుకాని పరీక్షలో ‘‘ఉత్తీర్ణత సాధించాడు’’ అని ప్రకటించగా.. అతని సహచరురాలు విద్య ఒక అడుగు ముందుకు వేసింది. మహారాజా కాలేజీకి చెందిన నకిలీ సర్టిఫికెట్‌తో రెండేళ్లపాటు రెండు కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేసింది. మహారాజా కళాశాల సెంట్రల్ కేరళలో ఎస్ఎఫ్ఐ రాజధానిగా ఉంది. 

ఆర్షో వాస్తవాలను తారుమారు చేశాడని కళాశాల ప్రిన్సిపాల్‌ తొలుత చెప్పారు. అయితే గంటల వ్యవధిలోనే రెండు సార్లు తన స్టేట్‌మెంట్‌ను మార్చేసి అర్షోకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. అయితే విద్యా మాత్రం.. నకిలీ పత్రాలను రూపొందించినందుకు పోలీసుల అభియోగాలను ఎదుర్కొంటోంది.

ఈ పరిణామాల నుంచి సీపీఎం గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. కామ్రేడ్‌లు ఆఫీస్ బేరర్లు కావడానికి వయోపరిమితిని నిర్ణయించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇరవయ్యేళ్ల వయసులో ఉన్న వారు కూడా నాయకత్వంలో ఉన్నారు. యువ సహచరులు నాయకత్వ స్థానాలకు పోటీ చేయాలనుకునే ముందు పార్టీ ఇప్పుడు వయసును ప్రతిపాదికగా తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. 

గ్రూప్ జిందాబాద్..
కర్ణాటకలో కాంగ్రెస్ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య సంధి ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉండవచ్చు. కానీ పలుచోట్ల మాత్రం అలాంటి ఒప్పందాలు కుదరడం లేదు. కేరళలో ఆ పార్టీ యంత్రాంగం గ్రూప్‌లతో పతనమవుతోంది. ఇటీవలి బ్లాక్-లెవల్ ఆఫీస్ బేరర్ల ప్రకటన కేరళ కాంగ్రెస్‌లోని విబేధాలను మరోసారి తెరమీదకు తెచ్చింది.

ఏకే ఆంటోనీ పదవీ విరమణ, ఊమెన్ చాందీ అనారోగ్యంతో నిద్రాణంగా మారిన కేరళలోని ఆంటోనీ వర్గం దీనిపై నిరసనకు దిగింది. బెన్నీ బెహెనన్ తమ వాదనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే.. ఏ గ్రూప్ (చాందీ నేతృత్వంలోని) తన కార్యకలాపాలన్నింటినీ పునరుద్ధరిస్తుందని బహిరంగంగా హెచ్చరించారు. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ క్యాలిబర్‌పై ప్రముఖ నేత రమేష్‌ చెన్నితాల కూడా ప్రశ్నలు సంధించారు. 

నిజానికి మరో అసమ్మతి నేత ఎంఎం హసన్‌ మాటల్లోనే అసంతృప్తుల గుట్టు రట్టయింది. ‘‘కేపీసీసీ అధ్యక్షుడు చాలా ఆందోళన చెందుతున్న వ్యక్తి. గ్లోబల్ వార్మింగ్‌కు పరిష్కారాలు చూపాలని ఆయన కోరారు. రుతుపవనాల ప్రారంభం ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయంపై మేం కలిసి చర్చించాం’’ అని హసన్ మీడియాకు తెలిపారు. ఆయన మాటలు పార్టీలో భారీ మెరుపులను అంచనా వేసే ఉరుములా వినిపించాయి.

ఎడారి తుఫాను.. 
గ్రూపిజం దుమ్ము గాలి రాజస్థాన్ కాంగ్రెస్ ఎన్నికల నడకను కళ్లకు కట్టింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్ మధ్య ఉన్న సమస్యలను ఏఐసీసీ పరిష్కరించలేకపోతుంది. ఈ నెలలో కొత్త పార్టీని ప్రారంభిస్తాననేలా బెదిరించిన యువనేతపై అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా జూన్ 11వ తేదీని యువ నేత ఎంపిక ఉంటుందా? లేదా? అన్న టెన్షన్ హైకమాండ్‌కు ఉంది. ఏప్రిల్ 11న పార్టీకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష, మే 11న జన్ సంఘర్ష్ యాత్ర చేస్తానని యువనేత పైలట్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత కేంద్ర మంత్రిగా మారిన తన స్నేహితుడు, మాజీ పార్టీ సహచరుడు జ్యోతిరాదిత్య సింధియాను పైలట్ అనుసరిస్తాడా లేదా అని రాజస్థాన్ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


చంద్రబాబు కలలు..
ఇటీవల ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  కూడా పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత అనేక పుకార్లు వెలుగులోకి వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీయే‌తో కలిసి సాగిన చంద్రబాబు.. 2019 ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీకి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత బీజేపీ వ్యతిరేక కూటమికి ప్రయత్నించి విఫలమయ్యారు. 

బీజేపీకి వీడ్కోలు పలికిన దాదాపు ఐదేళ్ల తర్వాత బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం కావడంతో.. ఇరు పార్టీల మధ్య రాజకీయ పొత్తుకు తొలి అడుగుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత చంద్రబాబు.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.

బీజేపీతో పాటు దాని భాగస్వామి జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోనున్నట్టుగా బహిరంగంగానే ఆ పార్టీ శ్రేణులకు హితవు పలికారు. అయితే ఢిల్లీలో జరిగిన భేటీలో వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ అధిష్టానం చంద్రబాబును కోరినట్టుగా తెలిసింది. ఇందుకు చంద్రబాబు అంగీకరించాడని.. అయితే పరస్పర సహకారం ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది.  

అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీడీపీతో పొత్తును వ్యతిరేకించడంతో ఆ ఎత్తుగడ తొలిగిపోయే అవకాశం ఉంది. బండి సంజయ్‌ వైఖరిని మరో సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి సమర్థించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిగా మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు కలలు ఎండిపోతాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌