మలద్వారం గుండా గాలిని పంపిన స్నేహితుడు: చిన్నారి మృతి

By Siva KodatiFirst Published Jul 29, 2019, 2:02 PM IST
Highlights

ఆడుకుంటున్న సమయంలో కన్హా యాదవ్ మలద్వారంలో అతని స్నేహితుడు ఎయిర్ కంప్రెషనర్ నాజిల్ పెట్టి గాలిని పంపించాడు. దీంతో బాలుడి కడుపులోకి గాలి చేరి పొట్ట ఉబ్బిపోయింది. పొట్టలో ఒత్తిడి ఎక్కువైపోయి చిన్నారి మరణించాడు.

చిన్నారులు సరదాగా ఆడుకుంటూ చేసిన పని కారణంగా ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రామచంద్రయాదవ్ పాల్దా పారిశ్రామిక వాడలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు.

ఇతని ఆరేళ్ల కుమారుడు కన్హా యాదవ్ ఉన్నాడు. ఆదివారం సాయంత్రం ఆ చిన్నారి తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అయితే కాసేపటికి పొట్ట భారీగా ఉబ్బిపోయి ఇబ్బందిపడుతూ స్నేహితుల సాయంతో ఇంటికి వచ్చాడు.

తమ బిడ్డ పరిస్ధితిని చూసిన తల్లీదండ్రులు వెంటనే దగ్గరలోని మహారాజా యశ్వంత్ రావ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే ఆ చిన్నారి కన్నుమూశాడు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో బాబు ఎలా చనిపోయాడో చెప్పిన విన్న తల్లీదండ్రులు షాకయ్యారు.

ఆడుకుంటున్న సమయంలో కన్హా యాదవ్ మలద్వారంలో అతని స్నేహితుడు ఎయిర్ కంప్రెషనర్ నాజిల్ పెట్టి గాలిని పంపించాడు. దీంతో బాలుడి కడుపులోకి గాలి చేరి పొట్ట ఉబ్బిపోయింది. పొట్టలో ఒత్తిడి ఎక్కువైపోయి చిన్నారి మరణించాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!