ఎన్నికల బాండ్లతో బీజేపీకి అత్యధిక విరాళాలు.. అతిపెద్ద దాత ఎవరంటే? కొత్త డేటా వెల్లడించిన ఈసీ

By Mahesh K  |  First Published Mar 18, 2024, 2:22 AM IST

ఎన్నికల బాండ్లతో బీజేపీకి అత్యధిక విరాళాలు అందాయి. రూ. 6986.5 కోట్లు విరాళాలు వచ్చాయి. ఆ తర్వాతి పార్టీ బీజేపీకి చాలా దూరంలో ఉన్నది. రెండో స్థానంలో టీఎంసీ రూ. 1397 కోట్ల విరాళంతో ఉన్నది.
 


ఎన్నికల బాండ్లకు సంబంధించి తమకు విరాళాలు అందించిన దాతల వివరాలను డీఎంకే వెల్లడించింది. ఈ వివరాలు వెల్లడించిన అతికొద్ది పార్టీల్లో డీఎంకే ఒకటి. ఇక బీజేపీ, కాంగ్రెస్, ఆప్, టీఎంసీ వంటి ప్రధాన పార్టీలు తమకు విరాళాలు అందించిన దాతల వివరాలు అందించలేదు. ఈ వివరాలను ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్నికల బాండ్ల రూపంలో అత్యధికంగా విరాళాలు పొందిన పార్టీ బీజేపీ. ఈ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 6,986.5 కోట్లు అందాయి. బీజేపీ తర్వాత అత్యధిక విరాళాలు పొందిన పార్టీ టీఎంసీ (రూ. 1,397 కోట్లు), కాంగ్రెస్  (రూ. 1,334 కోట్లు), బీఆర్ఎస్ (రూ. 1,322 కోట్లు)గా ఉన్నాయి. అంటే.. ఎన్నికల బాండ్ల రూపంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న నాలుగో పార్టీ భారత రాష్ట్ర సమితి.

Latest Videos

ఆ తర్వాత బీజేడీ రూ. 944.5 కోట్లు, డీఎంకే రూ. 656.5 కోట్లు, వైసీపీ రూ. 442.8 కోట్లు విరాళాలు అందుకున్నాయి. ఆ తర్వాత జేడీఎస్ రూ. 89.75 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు అందుకున్నది.

Also Read: మోడీ వ్యాఖ్యలను మసాలా దట్టించి అనువాదించిన పురంధేశ్వరి

అయితే.. ఎన్నికల బాండ్ల కొనుగోలు విధానంలో అత్యధిక మొత్తంలో విరాళాలు అందించింది.. ఫ్యూచర్ గేమింట్, హోటల్ సర్వీసెస్ రూ. 509 కోట్లు తమిళనాడు అధికారిక డీఎంకేకు విరాళాలు ఇచ్చింది. జేడీఎస్‌కు రూ. 50 కోట్ల విరాళాలు ఇచ్చిన మెఘా ఇంజినీరింగ్ రెండో అతిపెద్ద దాతగా ఉన్నది.

click me!