ఏటీఎం సెంటర్‌లో ఫ్రాడ్..వృద్ధుడి అకౌంట్ నుంచి రూ. 90 వేలు మాయం చేసిన దొంగ

By Mahesh KFirst Published Feb 3, 2023, 8:24 PM IST
Highlights

ముంబయిలో ఓ వృద్ధుడి బ్యాంక్ ఖాతా నుంచి ఏటీఎం ఫ్రాడ్ చేసి ఓ దొంగ రూ. 90 వేల మాయం చేశాడు. ఏటీఎం సెంటర్‌లో సహాయం చేస్తున్నట్టు నటించి ఏటీఎం కార్డు మార్చాడు. ఆ తర్వాత డబ్బులు కాజేశాడు.
 

ముంబయి: 60 ఏళ్ల వృద్ధుడి ఖాతా నుంచి ఓ దుండగుడు రూ. 90 వేలు మాయం చేశాడు. ఏటీఎం సెంటర్‌లోనే ఈ ఫ్రాడ్ చేశాడు. ఏటీఎం నుంచి  డబ్బులు విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ వృద్ధుడికి సహాయం చేస్తున్నట్టు నటించి మోసం చేశాడు. మహారాష్ట్ర తుర్భే ఎంఐడీసీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

తుర్భేలోని జనతా మార్కెట్‌లో కూరగాయలు కొనడానికి 60 ఏళ్ల వృద్ధుడు వెళ్లాడు. అక్కడే మార్కెట్‌లో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కొన్ని డబ్బులు ఏటీఎం నుంచి విత్ డ్రా చేయడానికి ప్రయత్నించాడు. కానీ, విత్ డ్రా చేసుకోవడంలో అవస్థ పడ్డాడు. ఏదో సమస్యతో డబ్బులు విత్ డ్రా కాలేదు. ఇది గమనించి ఓ యువకుడు ఏటీఎంలోకి వెళ్లాడు. అతడిని ఆ వృద్ధుడు నమ్మాడు.

Also Read: అదానీ గ్రూప్ షేర్ల క్షీణత పై BSE, NSE అతి పెద్ద నిర్ణయం, సర్క్యూట్ ఫిల్టర్ పరిమితిని మార్చేసిన ఎక్స్‌చేంజీలు..

తాను సహాయం చేస్తానని నమ్మించిన ఆ యువకుడి ముందే ఆ వృద్ధుడు ఏటీఎం సెంటర్‌లో ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేశాడు. అతని ముందే ఏటీఎం పిన్ కూడా ఎంటర్ చేశాడు. అయినప్పటికీ డబ్బులు రాలేవు. అప్పుడే ఆ దుండగుడు వృద్ధుడిని మాటల్లోకి దించాడు. అతని చేతిలోని ఏటీఎం కార్డు తీసుకుని వేరే ఏటీఎం కార్డు చేతికి ఇచ్చాడు.

అనంతరం, వారిద్దరూ ఏటీఎం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొద్ది సమయం తర్వాత వృద్ధుడి ఫోన్‌ కు మెస్సేజీ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే.. రూ. 90 వేలు విత్ డ్రా చేసుకున్నట్టు ఉన్నది. అప్పుడు తాను మోసపోయానని, తన కు వేరే ఏటీఎం కార్డు ఇచ్చాడని గ్రహించాడు. వెంటనే తన ఏటీఎం కార్డు బ్లాక్ చేశాడు. మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుర్భే ఎంఐడీసీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

click me!