లోయలోకి దూసుకెళ్లిన కారు... నలుగురు మృతి

Published : Sep 02, 2019, 01:38 PM ISTUpdated : Sep 02, 2019, 01:48 PM IST
లోయలోకి దూసుకెళ్లిన కారు... నలుగురు మృతి

సారాంశం

 పుత్తూరు సమీపంలోని మద్యంగళ ప్రాంతంలో బుధవారం ఉదయం వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి లోయలో పడింది. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు, ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 

లోయలోకి కారు దూసుకువెళ్లి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం మైసూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... పుత్తూరు సమీపంలోని మద్యంగళ ప్రాంతంలో బుధవారం ఉదయం వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి లోయలో పడింది. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు, ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 

క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచానకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు వారు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్