కలకత్తాలో దారుణం.. పాతకక్షలతో ఒకే కుటుంబంలోని నలుగురు హత్య..

Published : Aug 11, 2022, 09:10 AM IST
కలకత్తాలో దారుణం.. పాతకక్షలతో ఒకే కుటుంబంలోని నలుగురు హత్య..

సారాంశం

హౌరాలోని ఎంసీ ఘోష్ లేన్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్య జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ యువకుడు, మైనర్ బాలిక ఉన్నారు. 

కోల్‌కతా : పాత గొడవల కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో బుధవారం రాత్రి ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రాథమిక నివేదికల ప్రకారం మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ యువకుడు, మైనర్ బాలిక ఉన్నారు. హౌరాలోని ఎంసీ ఘోష్ లేన్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్య జరిగింది. ఈ దారుణ హత్య వెనుక ఓ జంట హస్తం ఉన్నట్లు చెబుతున్నారు. 

ఘటన అనంతరం ప్రధాన నిందితుడు అక్కడి నుంచి పారిపోగా, అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా తెలిసిన సమాచారం ప్రకారం, రాత్రి కుటుంబీకుల ఇంటి తలుపుకిందినుంచి రక్తం కారుతుండడంతో.. అది గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలిని సందర్శించిన పోలీసు బృందం రక్తపు మడుగులో పడి ఉన్న నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. దీనిమీద తదుపరి విచారణ జరుగుతోంది.

PM Modi: నిరాశ, నిస్పృహలతో చేత‌బ‌డిని ఆశ్ర‌యిస్తున్నారు .. ప్ర‌ధాని మోడీ షాకింగ్ కామెంట్స్

PREV
click me!

Recommended Stories

Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ