బార్‌లో డ్యాన్సర్లుగా పనిచేయాలని వేధింపులు

By narsimha lodeFirst Published Jun 30, 2019, 11:39 AM IST
Highlights

ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో ఉద్యోగం  కోసం వచ్చిన నలుగురు యువతులను బలవంతంగా  బార్ డ్యాన్సర్లుగా మార్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. భారత ప్రభుత్వ సహకారంతో  నలుగురు యువతులు స్వదేశానికి తిరిగి వచ్చారు.


న్యూఢిల్లీ: ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో ఉద్యోగం  కోసం వచ్చిన నలుగురు యువతులను బలవంతంగా  బార్ డ్యాన్సర్లుగా మార్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. భారత ప్రభుత్వ సహకారంతో  నలుగురు యువతులు స్వదేశానికి తిరిగి వచ్చారు.

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన నలుగురు 20 ఏళ్ల వయస్సున్న యువతులు ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ తరపున ఉద్యోగులుగా పనిచేసేందుకు దుబాయ్ కు చేరుకొన్నారు. అయితే ఈ సంస్థ యజమానులు వారిని ఓ గదిలో బంధించి బలవంతంగా వారితో బార్‌లో నృత్యాలు చేయాలని ఒత్తిడి చేశారు.

అయితే బాధితుల్లోని  ఓ మహిళ వాట్సాప్ ద్వారా తమ కుటుంబసభ్యులకు సమాచారం పంపింది. బాదిత కుటుంబసభ్యులు  విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు  విదేశీ వ్యవహారాల శాఖ దుబాయ్ అధికారులను సంప్రదించింది.  దుబాయ్‌ పోలీసుల నలుగురు మహిళలను రక్షించారు. బాధితులను ప్రత్యేక విమానంలో కోజికోడ్‌కు పంపారు.  
 

click me!