బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్

By narsimha lodeFirst Published Sep 19, 2022, 9:31 PM IST
Highlights

పంజాబ్ మాజీ సీఎం  అమరీందర్ సింగ్  ఇవాళ బీజేపీలో చేరారు. తాను గత ఏడాది ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని  బీజేపీలో విలీనం చేశారు అమరీందర్ సింగ్. 

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సోమవారం నాడు బీజేపీలో చేరారు.తాను ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ)ని బీజేపీలో విలీనం చేశారు.బీజేపీలో చేరడానికి ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అమరీందర్ సింగ్ భేటీ అయ్యారు. బీజేపీలో చేరాలని భావిస్తున్న పార్టీ నేతల జాబితాను కూడ తయారు చేస్తున్నామని కూడ లోక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రిత్సాల్ సింగ్ బలియావాల్ చెప్పారు. 

పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత  కాంగ్రెస్ పార్టీకి కూడ అమరీందర్ సింగ్ గుడ్ బై చెప్పారు. 2021 నవంబర్ మాసంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని అమరీందర్ సింగ్ ఏర్పాటు చేశారు.  వెన్నెముక శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత అమరీందర్ సింగ్  లండన్ నుండి ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు.ఇండియాకు వచ్చిన తర్వాత  ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు.

సీఎం పదవిని తప్పించడంతో అమరీందర్ సింగ్  కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్  బీజేపీ అకాలీదల్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అమరీందర్ సింగ్ పార్టీ 37 సీట్లలో పోటీ చేసినా ఒక్క సీటులో కూడా ఆ పార్టీ విజయం సాధించలేదు. తొలుత అకాళీదల్ లో ఉన్న అమరీందర్ సింగ్ ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. స్వంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కొన్నాళ్లకే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పనిచేశారు. గత టర్మ్ లో కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో అధికారంలోకి రావడానికి అమరీందర్ సింగ్ కారణంగా ఆ పార్టీ నేతలు చెబుతారు. కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరడాన్ని స్వాగతించారు.  . అమరీందర్ సింగ్ చేరికతో పంజాబ్ లో బీజేపీ బలోపేతం కానుందని ఆయన చెప్పారు 

click me!