ఫడ్నవీస్‌కు కరోనా: దేవుడు రెస్ట్ తీసుకోమంటున్నాడంటూ ట్వీట్

Siva Kodati |  
Published : Oct 24, 2020, 06:04 PM IST
ఫడ్నవీస్‌కు కరోనా: దేవుడు రెస్ట్ తీసుకోమంటున్నాడంటూ ట్వీట్

సారాంశం

దేశంలో కరోనా ఓ కొలిక్కి వచ్చినా మహారాష్ట్రలో మాత్రం పరిస్ధితి ఇంకా అదుపులోకి రాలేదు. అక్కడ ఇప్పటికీ భారీగానే కేసులు వెలుగుచూస్తున్నాయి

దేశంలో కరోనా ఓ కొలిక్కి వచ్చినా మహారాష్ట్రలో మాత్రం పరిస్ధితి ఇంకా అదుపులోకి రాలేదు. అక్కడ ఇప్పటికీ భారీగానే కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు.

తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు పరీక్షలు చేసుకోవాల్సిందిగా సూచించారు.

‘లాక్‌డౌన్‌ నుంచి నిరంతరం పనిలో ఉన్నాను. ఇప్పుడిక కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఆ దేవుడు కోరుకున్నట్టున్నాడు’ అంటూ ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

దీంతో దేవేంద్ర ఫడ్నవీస్‌ కోవిడ్‌ నుంచి కోలుకోవాలని బీజేపీ అగ్ర నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కరోనా వైరస్ కేసుల సంఖ్యలో మహారాష్ట్ర టాప్ లో ఉంది. కరోనా బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాల సంఖ్య 43 వేలను దాటింది.

 

 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?