కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత.. ప్రధాని మోడీ సంతాపం

By Rajesh KarampooriFirst Published Jan 31, 2023, 10:22 PM IST
Highlights

మాజీ న్యాయ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూశారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తండ్రి. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  అలహాబాద్ హైకోర్టులో చాలా ప్రసిద్ధమైన కేసులో రాజనారాయణ్ తరపున శాంతి భూషణ్ వాదించారు.

మాజీ న్యాయ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఢిల్లీలోని తన నివాసంలో నేడు తుది శ్వాస విడిచారు. శాంతి భూషణ్ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తండ్రి. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. శాంతి భూషణ్ 1977 నుండి 1979 వరకు మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో న్యాయ మంత్రిగా పనిచేశారు. ఆయన జూలై 1977 నుండి ఏప్రిల్ 1980 వరకు రాజ్యసభ సభ్యుడు కూడా వ్యవహరించారు. 

అలహాబాద్ హైకోర్టులో చాలా ప్రసిద్ధమైన కేసులో రాజనారాయణ్ తరపున శాంతి భూషణ్ వాదించారు. దీని కారణంగా 1974లో ఇందిరా గాంధీని ప్రధాని పదవి నుంచి తప్పించారు. అనేక ప్రజాప్రయోజనాల అంశాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా.. పలు అవినీతి సమస్యలపై ఆయన తన గళాన్ని విప్పారు. ఆయన తన కుమారుడు ప్రశాంత్ భూషణ్‌తో కలిసి అన్నా ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. దాని కారణంగా అతనికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తో అనుబంధం ఏర్పడింది. అయితే ఆయన ఎప్పుడూ పార్టీలో లేరు. శాంతి భూషణ్ కుమారులు జయంత్ , ప్రశాంత్ భూషణ్ సీనియర్ న్యాయవాదులు. రాఫెల్ ఫైటర్ జెట్ డీల్‌పై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిఐఎల్‌ను  వాదించారు.


శాంతి భూషణ్ 1980లో 'సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్' అనే NGOని స్థాపించారు. దీని ద్వారా ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా సుప్రీంకోర్టులో ముఖ్యమైన ప్రజా సమస్యలను లేవనెత్తారు. 2018లో 'మాస్టర్ ఆఫ్ రోస్టర్' విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా కోర్టు అంగీకరించలేదు.

ప్రధాని మోడీ సంతాపం

శాంతి భూషణ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలిపారు. శాంతిభూషణ్ న్యాయ రంగానికి ఆయన చేసిన కృషికి, అణగారిన వర్గాల కోసం చేసిన పోరాటాలతో ఆయన గుర్తుండి పోతారని ట్వీట్ చేశారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. 

click me!