ఢిల్లీ అల్లర్లు.. జేఎన్ యూ మాజీ విద్యార్థి నేత అరెస్ట్

By telugu news teamFirst Published Sep 14, 2020, 11:20 AM IST
Highlights

సోమవారం ఆయనను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా.. అల్లర్లకు సంబంధించి ఈ నెల 2వ తేదీన కూడా ఖలీద్ ను క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించారు. అంతకముందు కూడా ఖలీద్ పై పోలీసులు వివిధ అభియోగాలు మోపారు. 

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో జేఎన్ యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ ని పోలీసులు అరెస్టు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరని ఆరోపిస్తూ.. ఆయన పై కేసు నమోదు చేశారు.  అల్లర్లకు సంబంధించి ఖలీద్ ను స్పెషల్ సెల్ పోలీసులు నిన్న ఆయనను దాదాపు 11గంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేశారు.

కాగా.. సోమవారం ఆయనను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా.. అల్లర్లకు సంబంధించి ఈ నెల 2వ తేదీన కూడా ఖలీద్ ను క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించారు. అంతకముందు కూడా ఖలీద్ పై పోలీసులు వివిధ అభియోగాలు మోపారు. దీంతోపాటు ఆప్ ను సస్పెండ్ అయిన తాహీర్ హుస్సేన్,  ఉమర్ ఖలీద్, ఖలీద్ సఫీని కలిశాడాని చార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు.

జనవరిలో షహీన్ బాగ్ వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.

click me!