వివాహితకు ఫ్లైయింగ్ కిస్... మూడేళ్ల జైలు శిక్ష

Published : Aug 14, 2019, 01:08 PM IST
వివాహితకు ఫ్లైయింగ్ కిస్... మూడేళ్ల జైలు శిక్ష

సారాంశం

గత కొద్ది రోజులుగా వినోద్ సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె కనిపించిన ప్రతిసారి ఫ్లైయింగ్ కిస్సులు ఇవ్వడం... అసభ్యకర భంగిమలు చూపించడం లాంటివి చేస్తున్నాడు.


కొంతమంది మగవారి బుద్ధి ఎప్పుడూ వక్రంగానే ఉంటుంది. పరాయి స్త్రీ కనిపిస్తేచాలు..వారిలోని వక్ర బుద్ధిని బయటపెడుతూ ఉంటారు.  అవతల పక్క ఉన్నది స్త్రీ అయితే చాలు.. పెళ్లి అయ్యిందా.. కాలేదా, చిన్నా, పెద్దా లాంటివి కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారు. అలా ఓ వివాహితకు ఫ్లైయింగ్ కిస్స్ లు ఇస్తూ.. అసభ్యంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. ఫలితంగా మూడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రం మొహాలిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మొహాలి ప్రాంతానికి చెందిన వినోద్ అనే యువకుడు ఓ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నాడు. అదే అపార్ట్ మెంట్ లో వినోద్ ప్లాట్ కు ఎదురుగా ఓ మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా వినోద్ సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె కనిపించిన ప్రతిసారి ఫ్లైయింగ్ కిస్సులు ఇవ్వడం... అసభ్యకర భంగిమలు చూపించడం లాంటివి చేస్తున్నాడు.

ఈ విషయంలో మహిళ భర్త వినోద్ కి పలు మార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడం గమనార్హం. దీంతో విసిగిపోయిన ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా అతనిని కోర్టులో హాజరుపరచగా... మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధించారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu