అమ్మాయిని ముద్దుపెట్టుకోవాలంటూ ర్యాగింగ్.. ఐదుగురు స్టూడెంట్స్ అరెస్ట్...

Published : Nov 18, 2022, 10:39 AM IST
అమ్మాయిని ముద్దుపెట్టుకోవాలంటూ ర్యాగింగ్.. ఐదుగురు స్టూడెంట్స్ అరెస్ట్...

సారాంశం

ఒడిశాఒడిశాలో ఓ కాలేజీ విద్యార్థులు పైశాచికంగా వ్యవహరించారు. ర్యాగింగ్ పేరుతో జూనియర్లను విద్యార్థినిని ముద్దు పెట్టుకోవాలంటూ సతాయించారు.లో ఓ కాలేజీ విద్యార్థులు పైశాచికంగా వ్యవహరించారు. ర్యాగింగ్ పేరుతో జూనియర్లను విద్యార్థినిని ముద్దు పెట్టుకోవాలంటూ సతాయించారు.

బరంపురం : ర్యాంగింగ్ వికృతక్రీడను బ్యాన్ చేసినప్పటికీ.. కొన్ని కాలేజీల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. దీని బారిన పడిన విద్యార్థులు, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఓ దారుణమైన ఘటన ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలువురు విద్యార్థులు ర్యాగింగ్‌కు బానిసలైన సంగతి తెలిసిందే. ఇటీవల ర్యాగింగ్‌లో భాగంగా కొందరు విద్యార్థులు హింసకు పాల్పడ్డారు. ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. 

ర్యాగింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. బరంపురం నగరంలోని సుకుంద ప్రాంతంలోని బినాయక్ ఆచార్య డిగ్రీ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనకు సంబంధించి ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసినట్లు బరంపురం ఎస్పీ శరవణ్ వివేక్ వెల్లడించారు. బుధవారం ఓ కాలేజీ విద్యార్థిని ర్యాగింగ్‌కు పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ వెంటనే విచారణ చేయాలని పెద్దబజార్ పోలీసులను ఆదేశించారు. 

ఈ మేరకు గురువారం కళాశాలలో ఐఐసీ అధికారి భూపతి మహంతి, సిబ్బంది విచారణ చేపట్టారు. ఐదుగురు విద్యార్థులను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో అభిషేక్ నాయక్, బాబులా పాండాతోపాటు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న మరో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారని ఐఐసీ వివరించింది.

 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu