ఘోర రోడ్డు ప్రమాదం.. కారులోనే ఐదుగురి సజీవ దహనం..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 22, 2020, 12:59 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. కారులోనే ఐదుగురి సజీవ దహనం..

సారాంశం

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. 

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. 

పోలీసుల కథనం ప్రకారం రాంగ్ రూట్ లో రావడమే ఈ ప్రమాదానికి కారణం. యమునా ఎక్స్ ప్రెస్ వేపై రాంగ్ రూట్ లో వస్తున్న ఓ కంటైనర్ ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తప్పించుకునే అవకాశం లేక అందులో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ నాగాలాండ్ నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?