తమిళనాడు కడలూరులో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Published : Jan 03, 2023, 09:18 AM ISTUpdated : Jan 03, 2023, 10:40 AM IST
తమిళనాడు కడలూరులో  రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు  మంగళవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  :ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.డెడ్ బాడీలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు లో మంగళవారంనాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా వేపూర్ సమీపంలో మంగళవారంనాడు ఉదయం  ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన  ఐదుగురు మృతి చెందారు. కారులో  ఉన్న ఐదు మృతదేహలను  పోస్టుమార్టం నిమిత్తం  స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వరుసగా  ఆరు వాహనాలు ఢీకొన్నాయి. రెండు ప్రైవేట్  బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఢీకొన్నాయి.  ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


దేశంలో ప్రతి రోజూ  రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనాలను అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  రోడ్డు ప్రమాదాల విషయంలో   పోలీసుల సూచనలను వాహనదారులు  పట్టించుకోవడం లేదనే  విమర్శలు లేకపోలేదు. ఈ నెల  1వ తేదీన రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. షికార్ లోని ఖండేలాలలో  జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. రెండు వాహనాలు ఢీకొనడంతో  ఈ ప్రమాదం జరిగింది. 

ఈ నెల  1వ తేదీన సికింద్రాబాద్ బోయినపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  బోయినపల్లిలో రోడ్డు దాటుతున్న వృద్ద దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వీరిద్దరూ  మృతి చెందారు హైద్రాబాద్ లో ఉన్న కొడుకును చూసేందుకు  ఆదిలాబాద్ జిల్లా నుండి ఈ దంపతులు  వచ్చారు.  రోడ్డు దాటుతున్న సమయంలో బస్సు వీరిని ఢీకొట్టింది. గత ఏడాది డిసెంబర్  31న మహబూబాబాద్ జిల్లా అయ్యవారిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గ్రానైట్ లోడ్ తో వెళ్తున్న లారీపై నుండి రాళ్లు  ఆటోపై పడడంతో  ఈ ప్రమాదం జరిగింది.  ఈ ఆటోలో ప్రయాణీస్తున్న ఎనిమిది మందిలో  ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.గత ఏడాది డిసెంబర్  31న  గుజరాత్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  తొమ్మిది మంది మరణించారు.  బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో  9 మంది మృతి చెందారు. 
 

PREV
click me!

Recommended Stories

Indian Army :ఎముకలు కొరికే చలిలో ఇండియన్ఆర్మీ కవాతు | PirPanjal Heavy Snowfall | Asianet News Telugu
First Day of 2026 at Sabarimala: నూతన సంవత్సరం శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ | Asianet News Telugu