
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా కావేరిపట్నంలో గురువారంనాడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.ట్రాక్టర్ ను మినీ బస్సు ఢీకొంది. దీంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, వాహనంపై నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. మరో వైపు మద్యం మత్తులో వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు కారణాలుగా పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు తరచుగా జరిగే ప్రదేశాలను గుర్తించి ప్రమాదాల నివారణకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఆటో , లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందితే మరో ఇద్దరు గాయపడ్డారు. పెళ్లికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 14న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు . బైక్ పై వెళ్తున్న దంపతులను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవ దంపతులు మృతి చెందారు.
ఈ నెల 16న తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆటో, ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ నెల 22న మహరాష్ట్రలోని పుణెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ నెల 21న మేఘాలయలోని నార్త్ గారోహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.