
Firing in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం రేగింది. పుట్టినరోజు సంబురాల్లో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలకు హాజరైన ముగ్గురు చిన్నారులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బుల్లెట్ల గాయాలకు ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని న్యూ సీలంపూర్‌కు చెందిన అమీర్ అలియాస్ హంజాగా గుర్తించారు. ఇతను దినసరి కూలీ అని, ఇంతకుముందు మరో కేసులో కూడా ఇతను ప్రమేయం ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు కుతుబుద్దీన్ అనే వ్యక్తి తన పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు ఆగస్టు 6న వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. ఈ సమయంలో గాయపడిన పిల్లలను వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఇప్పటికే జెపిసి ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. 'వీధిలో ఆడుకుంటున్న పిల్లలను అల్లరి చేస్తున్నారనీ, వారిని అక్కడి నుంచి వెళ్లిపొమ్మని బెదిరించాడనీ.. ఆయన బెదింపులకు పిల్లలు భయపడకుండా పిల్లలు అక్కడే అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన అమీర్ తన పిస్టల్‌తో పిల్లలపై కాల్పులకు తెగబడ్డాడు. ఇది చూసిన వసీం, అమీర్‌తో తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత నిందితులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) సంజయ్ సైన్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు అమీర్‌ను అరెస్టు చేశారు. అతని నుంచి 2 లైవ్ కాట్రిడ్జ్‌లతో కూడిన అత్యాధునిక సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గాయపడిన ముగ్గురు పిల్లలు 13 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు.
ముగ్గురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం అమీర్ అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన చిన్నారులంతా ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు (307), ఆయుధ చట్టంలోని ఇతర సెక్షన్ల కింద సీలంపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటన ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకుంది.