హాస్పిటల్‌ కోవిడ్ వార్డులో అగ్నిప్రమాదం.. 11 మంది కరోనా పేషెంట్లు దుర్మరణం

By telugu teamFirst Published Nov 6, 2021, 2:03 PM IST
Highlights

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మద్‌నగర్ జిల్లా హాస్పిటల్‌లోని ఐసీయూ వార్డులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది కరోనా పేషెంట్లు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ముంబయి: Maharashtra దారుణం జరిగింది. అహ్మద్‌నగర్‌లోని సివిల్ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్ వార్డు (ఐసీయూ)లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడినట్టు సమాచారం. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నారు. ఈ కోవిడ్ వార్డులో 17 మంది అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత పది మంది మరణించినట్టు సమాచారం వచ్చింది. ఏడుగురు గాయపడినట్టు తెలిసింది. కానీ, ఏడుగురిలో ఇద్దరి పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. ఇందులో ఒకరు మృతి చెందడంతో మరణించిన వారి సంఖ్య 11కు పెరిగింది.

హాస్పిటల్‌లో రెండు ఐసీయూ వార్డులున్నాయి. ఒకటి ఫస్ట్ ఫ్లోర్‌లో, రెండోది సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నది. అగ్ని ప్రమాదం కింది ఫ్లోర్‌లోనే చోటుచేసుకుంది. 17 మంది పేషెంట్లూ కింది ఫ్లోర్‌లోనే ఉన్నారు. నూతనంగా నిర్మించిన ఈ ఐసీయూ వార్డులను కొవిడ్ పేషెంట్లకు చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు.

Ahmednagarలోని Civil Hospitalలో మంటల్లో చిక్కుకున్న మిగతా Patientsను మరో Hospitalకు చికిత్స కోసం తరలించినట్టు అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజేంద్ర భోస్లే తెలిపారు. ఫైర్ ఆడిట్‌ను నిర్వహించబోతున్నట్టు వివరించారు. మంటలు రేగడానికి గల కారణాలు స్పష్టంగా ఇంకా తెలియరాలేదు. కానీ, అగ్నిమాపక శాఖ ప్రాథమిక విచారణలో ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకున్నట్టు తెలిసిందని కలెక్టర్ బోస్లే వివరించారు. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు జరుపుతామని మరో సీనియర్ అధికారి ఒకరు వివరించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఇందులో హాస్పిటల్ కింది ఫ్లోర్‌ల నుంచి దట్టమైన పొగ బయటకు వస్తున్నట్టు కనిపించింది. మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత కొందరు వార్డులోకి మళ్లీ వెళ్తున్నట్టు కనిపించారు. డాక్టర్లు, ఇతర మెడికల్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న పేషెంట్లను కాపాడే ప్రయత్నం చేస్తున్ దృశ్యాలూ కనిపించాయి.

Also Read: 64 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. 19వ ఫ్లోర్ నుంచి దూకేసిన వ్యక్తి

ఈ ఘటనపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వారందరికీ అవసరమైన సహాయం చేస్తామని తెలిపారు. ఘనటపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

ప్రతిపక్ష నేత, బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఘటనపై మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఇది చాలా సీరియస్ విషయమని వివరించారు. ఈ ఐసీయూ బిల్డింగ్ కొత్తగా నిర్మించారని, కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స కోసం దీన్ని నిర్మించారని పేర్కొన్నారు.

Also Read: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోట్లలో ఆస్తి నష్టం..!

అహ్మద్ నగర్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌సీపీ లీడర్ సంగ్రమ్ జగ్తప్ స్పందిస్తూ ఈ ప్రమాదం బాధారమని వివరించారు. బాధ్యులను కచ్చితంగా పట్టుకుంటామని, బాధితుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని చెప్పారు. ఘటనపై దర్యాప్తు కోసం రాష్ట్రస్థాయి కమిటీ వేయాలని అభిప్రాయపడ్డారు.

click me!