బెంగాల్‌లోని హబ్రాలోని రైల్వే మురికివాడలో అగ్నిప్రమాదం.. 50కి పైగా ఇళ్లు దగ్ధం

By Mahesh RajamoniFirst Published Dec 15, 2022, 12:15 AM IST
Highlights

Kolkata: బెంగాల్ లోని హబ్రాలో రైల్వే స్టేషన్ వద్ద (మురికివాడలో) అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 50 ఇళ్లు దగ్ధమయ్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చాయి.

fire broke out in a railway settlement: పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల రైల్వే సెటిల్‌మెంట్‌లో (మురికివాడలో)  బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో 50కి పైగా ఇళ్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. నార్త్ 24 పరగణాల హబ్రా మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 17 సమీపంలో సాయంత్రం 4.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నార‌ని అధికారులు తెలిపారు. మంటలు ఆ ప్రాంతంలో వేగంగా వ్యాపించేలోపు పెద్ద శబ్ధం వినిపించిందని స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు తూర్పు రైల్వే పరిధిలోని బొంగావ్, సీల్దా మధ్య రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

 

West Bengal | 50 houses gutted in a huge fire that broke out in the slum area in ward number 17 of Habra Municipality in North 24 Paraganas. Fire is brought under control now. pic.twitter.com/MgFhhhcv3Q

— ANI (@ANI)

అస్సాం మురికివాడలోనూ భారీ అగ్నిప్రమాదం

డిసెంబర్ 10 న అస్సాంలోని మురికివాడ కాలనీలో ఇలాంటి అగ్నిప్ర‌మాద‌ సంఘటన జరిగింది. ఫతసిల్ అంబారి ప్రాంతంలో అనేక లక్షల రూపాయల విలువైన అనేక ఇళ్లు, ఆస్తులు దగ్ధమయ్యాయి. మురికివాడ కాలనీలో అనేక సిలిండర్లు పేలడంతో ఈ సంఘటన జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నవంబర్ 23న అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలోని బోకాజన్ సమీపంలోని లాహోరిజాన్ ప్రాంతంలో ఇలాంటి మ‌రో సంఘటనలో అనేక ఇళ్లు, దుకాణాలు కాలిబూడిదయ్యాయి. మంటల్లో పలు సిలిండర్లు పేలినట్లు పోలీసులు తెలిపారు. 

click me!