
న్యూఢిల్లీ: హర్యానాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోనిపాట్‌లోని ఓ కెమికల్ ప్లాంట్‌లో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఢిల్లీ నుంచి అగ్నిమాపక యంత్రాలు స్పాట్‌కు చేరుకున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇదే రోజు ముంబయిలోని నలసోపారాలో పాండే నగర్ ఏరియాలోనూ ఓ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది మంటలు ఆర్పే పని చేస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు ఈ ప్రమాదం ఎవరూ గాయపడలేదని తెలిసింది. కాగా, ఢిల్లీలో గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఉపహార్ సినిమా హాల్‌లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లు స్పాట్‌కు చేరుకున్నాయి. మంటలు ఆర్పే పనిలో పడ్డాయి. సినిమా హాల్‌లో ఫర్నీచర్‌ను ఉంచిన ప్రాంతంలో
మంటలు చెలరేగినట్టు ఢిల్లీ అగ్నిమాపక శాఖ వెల్లడించింది.
దేశరాజధాని ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ సిలిండర్ బ్లాస్ట్‌లో 13 మంది గాయపడ్డారు. రెస్టారెంట్ ముందు ఉన్న వాహనాలు పేలుడు దాటికి ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడుతో మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఆర్పడానికి మూడు అగ్నిమాపక యంత్రాలు స్పాట్‌కు చేరుకున్నాయి. పోలీసు బలగాలు వెంటనే ఘటనాస్థలికి వచ్చాయి.
ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్ ఏరియాలో ఈ ఘటన ఏప్రిల్ 14న చోటుచేసుకుంది. జామియా నగర్‌లో ఓ భవనం బేస్‌మెంట్‌లోని రెస్టారెంట్‌లో ఈ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు తర్వాత తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బేస్‌మెంట్‌లోని షాపులో మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. పేలుడు దాటికి రెస్టారెంట్‌లోని..దాని ముందు ఉన్న వారూ గాయపడ్డారు. రక్త కారుతూ కొందరు కనిపించారు. మరికొందరు మంటలతో గాయపడి తోలు ఊడి కూడా కనిపించారు. కాగా, ఆ రెస్టారెంట్ ముందే ఉన్న కొన్ని ద్విచక్ర వాహనాలు చెల్లచెదురుగా పడ్డాయి. రెస్టారెంట్ లోపలి నుంచి వచ్చిన దుమ్ము.. ధ్వంసమైన శిథిలాలు ఎదురుగా కనిపించాయి.