వివాహిత కోసం ఇద్దరు కోట్లాట.. కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని..

Published : Nov 23, 2019, 11:12 AM IST
వివాహిత కోసం ఇద్దరు కోట్లాట.. కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని..

సారాంశం

ఈ నేపథ్యంలోనే హెన్రీ, రాజరాజన్‌ల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. హెన్రీ మద్దతుదారులు రాజరాజన్‌పై కట్టెలతో దాడి చేసి కత్తులతో పొడిచి గాయపరిచారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హెన్రీని అరెస్టు చేశారు. ఘటనపై మరింత విచారణ జరుపుతున్నారు. ఉపాధ్యయురాలిని విచారిస్తున్నారు.


పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. కత్తులతో పొడుచుకొని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని అరియలూరు జిల్లా తిరుమళంపాడి మారియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన నటరాజన్‌ కుమారుడు రాజరాజన్‌ (28)అవివాహితుడు. అతనికి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. అనంతరం అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజుల పాటు వారి బంధం అలాగే కొనసాగింది.  ఈ క్రమంలోనే ఆమెకు అదే పాఠశాలలో పని చేస్తున్న హెన్రి (40) అనే ఉపాధ్యాయుడితో స్నేహం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ సంగతి రాజరాజన్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే హెన్రీ, రాజరాజన్‌ల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. హెన్రీ మద్దతుదారులు రాజరాజన్‌పై కట్టెలతో దాడి చేసి కత్తులతో పొడిచి గాయపరిచారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హెన్రీని అరెస్టు చేశారు. ఘటనపై మరింత విచారణ జరుపుతున్నారు. ఉపాధ్యయురాలిని విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం సంచలనం.. 816 సీట్లు.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎంపీ స్థానాలు ఇవే !
Modi Speech on Delimitation in Parliament డీ లిమిటేషన్ పైపార్లమెంటులో మోదీ స్పీచ్ | Asianet Telugu