ఆడ కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం: అరెస్టు

Published : Jul 27, 2020, 06:53 AM IST
ఆడ కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం: అరెస్టు

సారాంశం

మహారాష్ట్రలోని థానేలో ఓ 40 ఏళ్ల వ్యక్తి వీధి కుక్కపై అత్యాచారం చేశాడు. ఆ విషయాన్ని గమనించిన యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

థానే: వీధి కుక్కపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆడకుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసినట్లు కొంత మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. 

వీధి కుక్కలకు ఆహారం అందించే కొంత మంది యువకులు తమకు ఆ విషయం చెప్పారని, ఆ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడు అత్యాచారం చేస్తుండగా యువకులు చూసి పట్టుకున్నారని వారు చెప్పారు. 

వారి ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు థానే పోలీసు కమిషనర్ ను కలిశామని, ఆయన ద్వారానే స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశామని జంతు సంరక్షమ కార్యకర్త అదితి నాయర్ చెప్పారు. 

ఆ సంఘటన మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద జరిగినట్లు అదితి నాయర్ చెప్పారు. నిందితుడు థానేలోని వాగ్లే ఎస్టేట్ లోని రోడ్ నెంబర్ 16లో ఉంటాడు. అతను దినసరి కూలీ.

ఆ ఘటనపై పోలీసులు తొలుత ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని, అయితే పోలీసు కమిషనర్ వివేక్ ఫనసల్కర్ ను కలిసిన తర్వాత ఫిర్యాుదును నమోదు చేసుకున్నారని అదితి నాయర్ చెప్పారు

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu