Road accidents: గురువారం ఉదయం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 27 మందికి గాయాలు అయ్యాయి. మహారాష్ట్రలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం 6 గంటల సమయంలో ముంబయి నుంచి బీడ్ వైపు వెళ్తున్న బస్సు ఆష్ట ఫటా వద్ద బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు.
9 Killed, 27 Injured In 2 Road Accidents: గురువారం ఉదయం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 27 మందికి గాయాలు అయ్యాయి. మహారాష్ట్రలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం 6 గంటల సమయంలో ముంబయి నుంచి బీడ్ వైపు వెళ్తున్న బస్సు ఆష్ట ఫటా వద్ద బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ రెండు ప్రమాదాల గురించి స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ప్రైవేట్ బస్సు, అంబులెన్స్ ఢీకొన్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒక వైద్యుడు సహా తొమ్మిది మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో ముంబయి నుంచి ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీడ్ వైపు వెళ్తున్న బస్సు ఆష్ట ఫటా వద్ద బోల్తా పడింది.
బస్సు అతివేగంతో వెళ్లడం, వాహనంపై దాని డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. అనంతరం స్థానికుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు బీడ్ జిల్లా వాసులు కాగా, ఒకరు యావత్మాల్ కు చెందినవారని అస్తి పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి సంతోష్ ఖేత్మలాస్ తెలిపారు. బస్సు ప్రమాదంలో 26 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు మరో అధికారి తెలిపారు. మృతులను ధోండిబా షిండే, డియోదత్ పెచే, మహ్మద్ ఆసిఫ్ దోస్త్ మహ్మద్ ఖాన్, అశోక్ భోండ్వే, రవి గోదాంబేగా గుర్తించారు.
అలాగే, బీడ్ లోని ధమన్ గావ్-అహ్మద్ నగర్ రోడ్డులోని అంబోరా వద్ద బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వేగంగా వచ్చిన అంబులెన్స్ ట్రక్కును వెనుక వైపు నుంచి ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. అంబులెన్స్ అహ్మద్ నగర్ వైపు వెళ్తోంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, అంబులెన్స్ లో ఉన్న వైద్యుడు అహ్మద్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులను డాక్టర్ రాజేష్ జింజుర్కే (35), అంబులెన్స్ డ్రైవర్ భరత్ లోఖండే (35), అష్టికి చెందిన మనోజ్ తిర్పుడే, పథర్డీకి చెందిన పప్పు తిర్ఖండేగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.