ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్

Published : Mar 30, 2021, 01:05 PM IST
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్

సారాంశం

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు లోక్ సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. 

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు లోక్ సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. 

‘మా నాన్నకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. దీంతో నేను, మా కుటుంబ సభ్యులు గృహ నిర్బంధంలోకి వెళ్ళాం. గత కొద్ది రోజులుగా మమ్మల్ని కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం’ అని ట్వీట్ చేశారు.

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విపరీతంగా విజృంభిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రజలంతా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo