నూతన వ్యవసాయ చట్టాలు: సుప్రీంలో పిటిషన్ వేసిన రైతు సంఘాల నేతలు

By narsimha lodeFirst Published Dec 11, 2020, 10:22 AM IST
Highlights

భారతీయ కిసాన్ యూనియన్ గురువారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ  భారతీయ కిసాన్ యూనియన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

న్యూఢిల్లీ: భారతీయ కిసాన్ యూనియన్ గురువారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ  భారతీయ కిసాన్ యూనియన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 15 రోజులుగా న్యూఢిల్లీలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేస్తాయని ఆ పిటిషన్ లో కిసాన్ యూనియన్ ఆరోపించింది.

న్యాయవాది ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ లో ఈ చట్టాలను తగిన చర్చ లేకుండా ఆమోదించారని ఆరోపించారు.

ఆందోళనలు చేస్తున్న రైతులతో కేంద్రం పలు దఫాలు చర్చించింది. అయితే ఈ చర్చలు అసంపూర్తిగా ఉన్నాయని ఈ పిటిషన్ లో యూనియన్ నేతలు పేర్కొన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆరు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. డీఎంకె ఎంపీ తిరుచి శివా, ఆర్జేడీ ఎంపీ మనోజ్, కాంగ్రెస్ కు చెందిన రాకేష్ వైష్ణవ్ పిటిషన్లు దాఖలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాల అమలుపై స్టే ఇవ్వాలని భారతీయ కిసాన్  పార్టీ సుప్రీంకోర్టును కోరింది.

ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వాదనలు విన్పించేందుకు అనుమతి ఇవ్వాలని భారతీయ కిసాన్ యూనియన్ కోరింది. డిసెంబర్ చివరి వారంలో ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది.

నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం రెస్పాన్స్ కోరుతూ అక్టోబర్ 12వ తేదీన  సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.


 

click me!