ఢిల్లీకి చేరిన కిసాన్ క్రాంతి యాత్ర.. అడ్డుకున్న పోలీసులు

Published : Oct 02, 2018, 12:18 PM ISTUpdated : Oct 02, 2018, 12:21 PM IST
ఢిల్లీకి చేరిన కిసాన్ క్రాంతి యాత్ర.. అడ్డుకున్న పోలీసులు

సారాంశం

నేడు ఢిల్లీలోని కిసాన్ ఘాట్‌కు చేరడంతో కిసాన్ క్రాంతి యాత్ర ముగియనుండగా..ఉత్తరప్రదేశ్-ఢిల్లీ సరిహద్దులో కిసాన్ క్రాంతి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

రైతుల రుణమాఫీ, మద్దతు ధర, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. సెప్టెంబర్ 23న హరిద్వార్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నేడు దేశరాజధాని ఢిల్లీకి చేరింది.నేడు ఢిల్లీలోని కిసాన్ ఘాట్‌కు చేరడంతో కిసాన్ క్రాంతి యాత్ర ముగియనుండగా..ఉత్తరప్రదేశ్-ఢిల్లీ సరిహద్దులో కిసాన్ క్రాంతి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

 

భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. పోలీసులు వాటర్‌కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించి కిసాన్ ఘాట్‌కు వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్