యూపీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం: ముజ‌పర్‌నగర్‌లో రైతు సంఘాల సమావేశం

By narsimha lodeFirst Published Sep 5, 2021, 4:29 PM IST
Highlights

 యూపీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి రైతు సంఘాలు. ఇవాళ ముజఫర్ నగర్ లో రైతు సంఘాలు సమావేశం నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా ఈ తరహాలో సమావేశాలు నిర్వహిస్తామని  నేతలు తేల్చి చెప్పారు.

లక్నో:రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో రైతు సంఘాల నేతలు సమావేశమయ్యారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కూడా తీర్మాణం చేశారు.

అతి కొద్దిమంది రైతులే కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని కేంద్రం పెద్దలు చేస్తున్న ప్రచారంపై రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. పార్లమెంట్ లో కూర్చొన్న ఎంపీలకు రైతుల నిరసనలు తెలిసేలా ఉద్యమిస్తామని నేతలు ప్రకటించారు.రాకేష్ తికాయత్ సహా పలువురు రైతు సంఘాల నేతలు హాజరైన ఈ సమావేశానికి సుమారు 8 వేల మంది భద్రతా సిబ్బంది సెక్యూరిటీ కోసం వినియోగించారు. యూపీలోని జీఐసీ మైదానంలో ఈ సమావేశం జరిగింది.

తమ ఆందోళనలను ప్రభుత్వం ఇప్పటికైనా అర్ధం చేసుకొంటే మంచిదని రాకేష్ తికాయత్ చెప్పారు. దేశం మొత్తం ఈ తరహా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రైతులు, కార్మికులు, యువకులు జీవించడానికి  అనుమతించాలని ఆయన కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహ నిరసనలను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.  ప్రతి గ్రామానికి ఈ సందేశాన్ని తీసుకెళ్లనున్నారు. మరో వైపు ఈ నెల 27న దేశ వ్యాప్త సమ్మె చేయాలని కూడ రైతుసంఘాల నేతలు యోచిస్తున్నారు.ఆగష్టు 28వ తేదీన హర్యానాలోని కర్నాల్ లో రైతులపై పోలీసుల లాఠీచార్జీ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఓ రైతు మరణించాడు. అయితే గుండెపోటుతోనే రైతు మరణించాడని పోలీసులు ప్రకటించారు.


 

click me!